మాస్క్‌తో మొటిమలు

ఆఫీసుకు వెళుతుండటంతో మాస్క్‌ తప్పనిసరైంది. సాయంత్రానికల్లా బుగ్గల మీద మొటిమలు వచ్చేస్తున్నాయి. దీనికి పరిష్కారం చెప్పండి.

Published : 24 Jul 2021 01:26 IST

ఆఫీసుకు వెళుతుండటంతో మాస్క్‌ తప్పనిసరైంది. సాయంత్రానికల్లా బుగ్గల మీద మొటిమలు వచ్చేస్తున్నాయి. దీనికి పరిష్కారం చెప్పండి. - ఓ సోదరి, హైదరాబాద్‌

దీన్ని మాస్క్‌ యాక్నేగా చెబుతాం. ముఖం మీద చర్మ రంధ్రాల్లో ఏదైనా అడ్డు పడ్డప్పుడు సాధారణంగా ఆక్నే వస్తుంది. కొందరిలో సెన్సిటివ్‌ స్కిన్‌ ఉంటుంది. ఉపయోగించే వస్త్రం, సువాసన కోసం వాడుతున్న పదార్థాలు వంటి వల్లా ఎర్రబడటం, దద్దుర్లు వంటివి వస్తాయి. జిడ్డు చర్మం ఉండి, దుమ్ము, మృతకణాలు అడ్డుపడ్డప్పుడు మామూలుగానే మొటిమలు వస్తాయి. వీటికి మాస్క్‌ కూడా తోడవుతోంది. మాస్క్‌ శ్వాస ద్వారా ఏర్పడే తేమను బంధించేస్తుంది. దీనికితోడు చెమట, వస్త్రం చర్మానికి ఒరుసుకోవడం, ఫ్యాబ్రిక్‌ అలర్జీ వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. ఉతికేవైతే మాస్క్‌లను తరచూ శుభ్రం చేసుకోవాలి. ఒకేదాన్ని ఎక్కువ కాలం వాడొద్దు. బయటి నుంచి వచ్చాక క్లెన్సర్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఆపై నాన్‌ కమోడొజెనిక్‌ మాయిశ్చరైజర్‌ను రాయాలి. తర్వాత టాపికల్‌ యాంటీబయాటిక్‌ క్రీమ్‌ను రాయాలి. రాత్రిపూట క్లెన్సింగ్‌ తర్వాత మాయిశ్చరైజర్‌తోపాటు సాల్సిలిక్‌ యాసిడ్‌ ఉన్న క్రీమ్‌ను రాసుకోవాలి. మాస్క్‌ వేసుకుంటున్నపుడు మేకప్‌ను పక్కన పెట్టేయాలి. సమస్య మరీ ఎక్కువగా ఉంటే వైద్యుల సలహా మేరకు యాంటీబయాటిక్స్‌ను తీసుకోవాలి. గుంపుగా కాకుండా విడిగా ఉంటే కొన్ని గంటలకోసారి మాస్క్‌ను పక్కన పెట్టడం మంచిది. మెత్తగా, కాటన్‌ వస్త్రాలతో చేసిన మాస్క్‌లను ఎంచుకోవాలి. మరీ బిగుతుగా ఉన్నవి వాడొద్దు. డిస్పోజల్‌ వాటిని ఓసారి వాడాక తీసేయాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే యాక్నే నుంచి బయటపడొచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని