అయినా పిలవలేదంటే... కారణమేంటి?

మూడు రౌండ్ల ఇంటర్వ్యూను ఎదుర్కొన్నాను. నా ప్రదర్శన బాగుంది, ఉద్యోగానికీ బాగా సరిపోతాననిపించింది.

Updated : 06 Aug 2021 17:17 IST

మూడు రౌండ్ల ఇంటర్వ్యూను ఎదుర్కొన్నాను. నా ప్రదర్శన బాగుంది, ఉద్యోగానికీ బాగా సరిపోతాననిపించింది. ఇంటర్వ్యూ ముగిసి మూడు వారాలవుతున్నా సంస్థ నుంచి ఏ కబురూ లేదు. దీన్నెలా అర్థం చేసుకోవాలో తెలియట్లేదు. ఫాలోఅప్‌ మెయిల్‌ చేసినా స్పందన లేదు. ఏం చేయాలి?

- ఓ సోదరి, కాకినాడ

ద్యోగానికి సరిపోవటం, ఇంటర్వ్యూ బాగా చేయడం, మూడు రౌండ్ల వరకూ వెళ్లడం.. ఎవరికైనా ఆశను కలిగించే అంశాలే. అందుకే ఎదురు చూసినా ఏకబురూ రాకపోతే నిరాశ కలుగుతుంది. సంస్థ ఇలా చేయడానికి చాలా కారణాలుంటాయి. వాటిని డీకోడ్‌ చేయడం మాని మీమీద మీరు దృష్టి పెట్టుకోవడం మంచిది. మొదట మీరు చేయగలిగినంతా చేశారన్నది గుర్తుంచుకోండి. ఏం చెప్పానో, ఎక్కడ తప్పు చేశానో అని ఆలోచించడం మానేయండి. సమయ వృథాతో పాటు ఆందోళన తప్ప లాభమేమీ ఉండదు. వేరే వాటికి ప్రయత్నిస్తూ మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోండి. ఇది మీకు కచ్చితంగా సరిపడే ఉద్యోగమనిపించినా, ఎప్పటినుంచో ఎదురు చూసేదే అయినా.. ఇంకా ఎన్నో సంస్థలూ, ఉద్యోగాలూ ఉన్నాయని గుర్తుంచుకోండి. వాటికీ రెట్టింపు సంకల్పంతో ప్రయత్నించండి. ఏమో! భవిష్యత్‌లో దానికంటే ఉత్తమమైనదే వేచి చూస్తుండొచ్చు. మీ ప్రదర్శనా గతంలోకంటే కచ్చితంగా బాగుంటుంది.

డియర్‌ వసుంధర

ఇంటర్వ్యూ పూర్తయ్యి, థాంక్స్‌ నోట్‌ పంపాక 10-14 రోజులు వేచి ఉండండి. అప్పటికీ ఏ సమాచారమూ లేకపోతే పరిస్థితిని కనుక్కుంటూ మెయిల్‌ పెట్టండి. అదనంగా ఏమైనా పంపాలేమో కనుక్కోండి. ఇదంతా క్లుప్తంగా, మర్యాదగా, అక్షరదోషాలు లేకుండా ఉండేలా చూసుకోండి. నెట్‌వర్కింగ్‌ను మాత్రం ఆపొద్దు. ఇది కాకపోయినా వేరే అవకాశాలు పొందొచ్చు. ఒక్కోసారి కోరుకున్న సంస్థలో ఉద్యోగం పొందడానికి అవసరమైన సాయమూ దొరకొచ్చు. అలాగే ఇంటర్వ్యూ తర్వాత 10 రోజులైనా ఏ సమాచారమూ లేకపోతే విఫలమైందనే భావించండి. ఇక్కడ మీరెన్ని రౌండ్లు ఎదుర్కొన్నా దాదాపుగా అవకాశం లేదనే భావించాలి. కారణం ఒక్కోసారి మీ వైపు ఉంటే ఇంకోసారి సంస్థవైపు నుంచీ ఉండొచ్చు. కాబట్టి, ఎక్కువగా ఆలోచించకుండా ఇతర ప్రయత్నాలు చేస్తూ ముందుకు సాగడం మాత్రం ఆపొద్దు.

మీకు సంబంధించిన ప్రశ్నను అడగడానికి ఇక్కడ క్లిక్‌ చేయండి...

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని