నేనేం చేసినా ఆమెకు నచ్చట్లేదు!

మా బాస్‌కి నేనేం చేసినా నచ్చదు. మూడేళ్లుగా చేస్తున్నాను. ఆమె ఒక్కసారీ ప్రశంసించిందే లేదు. నిరుత్సాహంతో పని మీద శ్రద్ధే ఉండటం లేదు.

Updated : 23 Nov 2022 11:11 IST

మా బాస్‌కి నేనేం చేసినా నచ్చదు. మూడేళ్లుగా చేస్తున్నాను. ఆమె ఒక్కసారీ ప్రశంసించిందే లేదు. నిరుత్సాహంతో పని మీద శ్రద్ధే ఉండటం లేదు. వేరే విభాగాల్లోని నా స్నేహితులు పై అధికారులతో మెప్పు పొందు తుండటం చూస్తోంటే నా పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. దీన్ని తట్టుకుని నిలబడేదెలా?

- ఓ సోదరి, బెంగళూరు

కేవలం పై అధికారి మీ పనిని గుర్తించనంత మాత్రాన సంస్థా అభినందించడం లేదని కాదు. ముందు ఆమె ప్రశంసించకపోవడానికి కారణాన్ని, తనతో మీ బాంధవ్యాన్ని పరిశీలించుకోండి. కొందరు కిందివారి నుంచి విధేయత, ఎక్కువ గంటలు పని చేయడం లాంటివి ఆశిస్తారు. ఇంకా.. సకాలంలో పని చేయడం బాధ్యత, దీనిలో ప్రశంసించాల్సిందేముందనీ భావిస్తుండొచ్చు. మీ బాస్‌ తీరేంటో తెలుసుకోండి. అలాగే ఏ అంశాల్లో మెచ్చుకుంటోందో కూడా పరిశీలించండి.

వ్యాపారంలో వినియోగదారుడి నుంచి సర్వీస్‌ ఎలా ఉందో తెలుసుకుంటారు కదా! ఇదే విధానాన్ని మీ బాస్‌కీ వర్తింపజేయండి. మీ పని ఎలా, ఎంత వరకూ సంతృప్తికరంగా ఉందో కనుక్కోండి. అడిగే విధానం మీ అసంతృప్తిని తెలియజేసేలానో, ఫిర్యాదు చేస్తున్నట్లో మాత్రం ఉండకుండా చూసుకోండి. ఇక మీపరంగా.. వ్యక్తిగతంగా తీసుకోవడం మానండి. మెప్పు దక్కకపోయినా బాగా పనిచేస్తున్నట్లు మీకనిపించినంత వరకూ ఆమె మిమ్మల్ని లక్ష్యంగా చేసుకుందని భావించాల్సిన పనిలేదు. చెప్పడంలో విఫలమైనా మీ పని నాణ్యతను ఆమె గుర్తించవచ్చు. నిజంగా ప్రశంస మీకంత అవసరమా అన్నదీ పరిశీలించుకోండి. అలాగే మీతో ఉన్నట్లుగానే ఇతరులతోనూ వ్యవహరిస్తున్నారా అన్నదీ ప్రశ్నించుకోండి. మీ బాస్‌ కూడా పైవారి నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటుంటారు. కొత్తగా కింద వారి నుంచీ కోరుకోరు. వాస్తవాన్ని స్వీకరించడమే దీనికి ఉత్తమ పరిష్కారం. అనవసరంగా ఊహించుకుని, ఎక్కువగా విశ్లేషించకండి. వేరే మార్గాల్లో మీ అవసరాలను తీర్చుకునే వీలుందేమో చూసుకోండి. చివరగా.. ఇది చాలా సాధారణమైన పరిస్థితిని తెలుసుకోండి.

మీకు సంబంధించిన ప్రశ్నను అడగడానికి ఇక్కడ క్లిక్‌ చేయండి...

 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్