అతని భార్య కనిపించడం లేదు..మేం పెళ్లి చేసుకోవచ్చా?

నేనో వ్యక్తిని ప్రేమించాను. అతనికి ముందే పెళ్లయ్యింది. కొద్దికాలానికే ఆవిడ ఎటో వెళ్లిపోయింది. ఇది జరిగి మూడేళ్లవుతోంది. ఆవిడ ఆచూకీ తెలియదు. పోలీసు ఫిర్యాదు కూడా ఇచ్చారు. ఇప్పుడు మేం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం?....

Updated : 07 Aug 2021 17:27 IST

నేనో వ్యక్తిని ప్రేమించాను. అతనికి ముందే పెళ్లయ్యింది. కొద్దికాలానికే ఆవిడ ఎటో వెళ్లిపోయింది. ఇది జరిగి మూడేళ్లవుతోంది. ఆవిడ ఆచూకీ తెలియదు. పోలీసు ఫిర్యాదు కూడా ఇచ్చారు. ఇప్పుడు మేం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం? మా మూడు కుటుంబాలూ సుముఖంగానే ఉన్నాయి. మేం ఎలా ముందుకు వెళ్లవచ్చు?

- ఓ సోదరి, కాకినాడ

మీరు ప్రేమించిన వ్యక్తికి ఇంతకుముందే పెళ్లయిందని అంటున్నారు కదా! ఆవిడ వెళ్లిపోయినప్పుడు అతను ఎందుకు విడాకులు తీసుకోలేదు. ఆవిడ ఆచూకీ తెలియనంత మాత్రాన విడాకులు చట్టప్రకారం తీసుకోకుండా రెండో పెళ్లి చేసుకుంటే చెల్లదు. హిందూ వివాహ చట్టంలోని సెక్షన్‌(13) రెండు సంవత్సరాలు కలవకుండా వేర్వేరుగా ఉంటే ఇందులోని సబ్‌క్లాజ్‌(1బీ) ప్రకారం... దాన్ని కారణంగా చూపించి విడాకులు తీసుకోవచ్చు. భార్య/భర్త కనీసం ఏడేళ్లు కనిపించకుండా పోతే సబ్‌క్లాజ్‌(6) ప్రకారం వారు బతికి ఉన్నారని తెలియకపోయినా డైవోర్స్‌ పొందొచ్చు. అయితే ఆ విషయాన్ని కోర్టు ద్వారా నిరూపించాలి. ఇందుకోసం ఇంతకుముందు ఉన్న చిరునామా లేదా తల్లిదండ్రుల అడ్రస్‌ ఆధారంగా విడాకులకు ప్రయత్నించవచ్చు. ఇందుకు కోర్టులో ఒరిజినల్‌ పిటిషన్‌ వేయమనండి. వాళ్ల తండ్రి/తల్లి కూడా మాకు తనెక్కడ ఉందో తెలియదని కోర్టుకి చెబితే న్యాయస్థానం ద్వారా పత్రికా ప్రకటన వేయించండి. అలా కూడా రాకపోతే ఎక్స్‌పార్టీ ఆర్డర్‌ తీసుకోవచ్చు. చట్టబద్ధంగా విడాకులు తీసుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకుంటేనే చెల్లుబాటు అవుతుంది. ముందు అతడు మీ నుంచి ఏమైనా దాస్తున్నాడేమో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఆలోచించి నిర్ణయం తీసుకోండి.

మీకు సంబంధించిన ప్రశ్నను అడగడానికి ఇక్కడ క్లిక్‌ చేయండి...

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్