థైరాక్సిన్ తగ్గితే గర్భిణికి ప్రమాదమా!
నా వయసు 27. మూడో నెల గర్భిణిని. థైరాక్సిన్ హార్మోన్ స్థాయులు తక్కువగా ఉన్నాయని మాత్రలిచ్చారు. వీటితో పాటు ఆహారంలో...
నా వయసు 27. మూడో నెల గర్భిణిని. థైరాక్సిన్ హార్మోన్ స్థాయులు తక్కువగా ఉన్నాయని మాత్రలిచ్చారు. వీటితో పాటు ఆహారంలో ఏం మార్పులు చేసుకోవాలి?
- ఓ సోదరి, హుబ్లీ
శరీరంలోని థైరాయిడ్ గ్రంథి అయోడిన్‌ను వాడుకుని థైరాక్సిన్ అనే హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తుంది. శరీరానికి కావాల్సినంత అయోడిన్ అందకపోవడం వల్ల థైరాక్సిన్ ఉత్పత్తి, దాని పనితీరుపై ప్రభావం పడుతుంది. టీ3, టీ4 హార్మోన్లు సరిగా ఉత్పత్తి కావు. ఫలితంగా వాటి స్థాయులు మారుతూ ఉంటాయి.
మరో సమస్య ఏమిటంటే..
థైరాక్సిన్ ఉత్పత్తి సరిగా లేనప్పుడు కారణాలు లేకుండానే బరువు పెరుగుతారు. అది అవసరాని కంటే తక్కువగా ఉన్నప్పుడు హైపోథైరాయిడ్ సమస్య వస్తుంది. దాంతో బరువు పెరుగుతారు. గర్భస్థ సమయంలో థైరాక్సిన్ స్థాయులను నియంత్రణలో పెట్టాలి. లేకపోతే అబార్షన్ కావొచ్చు. బిడ్డ ఎదుగుదలలో లోపాలూ రావొచ్చు.
సాధారణంగా ఊబకాయుల్లో కూడా థైరాక్సిన్ హార్మోన్ ఉత్పత్తి సరిగా ఉండదు. దానికి తోడు గొంతు వాపు లాంటి సమస్యలొస్తాయి. ఇందుకు అయోడిన్ సహిత ఉప్పును వాడితే ప్రత్యేకంగా ఈ మూలకం ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాల్సిన అవసరం లేదు. మాత్రల ద్వారా థైరాక్సిన్ హార్మోన్ స్థాయులు కుదురుకోవడానికి 6 - 12 వారాలు పడుతుంది. ఈలోపు వ్యాయామం చేస్తూ పోషకాహారం తీసుకోవాలి. గర్భిణులకు ఎక్కువ మొత్తంలో అయోడిన్ అవసరమవుతుంది. నెలలు నిండే కొద్దీ అవసరం పెరుగుతుంటుంది. థైరాక్సిన్ ఉత్పత్తిలో తేడాలుంటే.. బిడ్డ ఎదుగుదల, శరీర ఆకృతి, పనితీరు మీద కూడా ఇది ప్రభావం చూపుతుంది. కాబట్టి కాబోయే తల్లులు మూడు నెలలకోసారి వైద్యులతో పరీక్షలు చేయించుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.