అమ్మ నీరసం తగ్గాలంటే ఏం తినిపించాలి?

మా అమ్మ వయసు 65 ఏళ్లు. నాలుగు నెలల కిందట తనకు కొవిడ్‌ వచ్చి తగ్గింది. అప్పటి నుంచి చాలా నీరసపడిపోయింది. తను మునుపటిలా ఉండాలంటే ఆహారంలో ఎలాంటి మార్పులు చేయాలి? 

Updated : 09 Sep 2022 11:49 IST

మా అమ్మ వయసు 65 ఏళ్లు. నాలుగు నెలల కిందట తనకు కొవిడ్‌ వచ్చి తగ్గింది. అప్పటి నుంచి చాలా నీరసపడిపోయింది. తను మునుపటిలా ఉండాలంటే ఆహారంలో ఎలాంటి మార్పులు చేయాలి? 

- స్వాతి, హైదరాబాద్‌

యాబెటిస్‌ ఉన్నవారిలో కొవిడ్‌ తర్వాత నీరసంగా అనిపించవచ్చు. కాబట్టి మీ అమ్మగారికి చక్కెర స్థాయులు ఎలా ఉన్నాయి, ఇతర ఆరోగ్య సమస్యలేమైనా ఉన్నాయేమో తెలుసు కునేందుకు టెస్ట్‌లు చేయించాలి.   

మూడు నుంచి అయిదు కిలోల వరకు బరువు తగ్గారంటే ఆమెకు అన్ని రకాల పోషకాలూ అందడం లేదని గుర్తించాలి. తను ముందున్న ఆహార అలవాట్లను పాటిస్తూనే మరికొన్నింటిని చేర్చుకోవాలి. కొన్ని సప్లిమెంట్స్‌ను వాడొచ్చు. జీర్ణవ్యవస్థ మీద ఒత్తిడి పెంచకుండా తేలికగా జీర్ణమయ్యేలా, పోషకాలు అందించే మెడికల్‌ న్యూట్రిషనల్‌ సప్లిమెంట్లని పోషకాహార నిపుణుల సలహాతో వాటిని ఆమెకు పెట్టొచ్చు. మీ అమ్మగారికి షుగరు లేకపోతే మొలకెత్తిన మాల్టెడ్‌ పొడిని (రాగి మాల్ట్‌ లాంటివి) నెయ్యి, పెరుగుతో కలిపి అదనంగా జావలా చేసి ఇవ్వొచ్చు. మాంసాహారులైతే గుడ్డు, చికెన్‌ సూప్‌ లాంటివి చేసి పెట్టొచ్చు. శాకాహారులైతే పెరుగు, ఉడకబెట్టిన పల్లీలు, నానబెట్టిన బాదం ఇవ్వొచ్చు. కూరగాయల సూప్‌లు, పండ్ల ముక్కలను ఇస్తూ ఉండాలి. మజ్జిగ, నిమ్మరసం.. ఇలా తేలికగా ఉండే పదార్థాలు అందించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్