రెండో పెళ్లి చేసుకుంటే బాబుకి ఆస్తి రాదా?
పెళ్లైన మూడేళ్లకే ఆయన అనారోగ్యంతో చనిపోవడంతో పుట్టింటికి వచ్చేశా. నాకో బాబు. ఇప్పుడు అమ్మానాన్నా నాకు మళ్లీ పెళ్లి చేయాలనుకుంటున్నారు. నేను రెండో పెళ్లి చేసుకుంటే బాబుకు తండ్రి
పెళ్లైన మూడేళ్లకే ఆయన అనారోగ్యంతో చనిపోవడంతో పుట్టింటికి వచ్చేశా. నాకో బాబు. ఇప్పుడు అమ్మానాన్నా నాకు మళ్లీ పెళ్లి చేయాలనుకుంటున్నారు. నేను రెండో పెళ్లి చేసుకుంటే బాబుకు తండ్రి ఆస్తిలో వాటా వస్తుందా? మా మామయ్యకి ముగ్గురు కొడుకులు. మావారి వాటా బాబుకు ఇచ్చే సూచనలు ఏమీ కనిపించడం లేదు. ఇప్పుడు మేమేం చేయాలి? - ఓ సోదరి, తాడేపల్లిగూడెం
మీ రెండో పెళ్లి... బాబుకి రావాల్సిన ఆస్తి హక్కుకి ఏ విధంగానూ ఆటంకం కాదు. ఆస్తి మీ మామయ్య స్వార్జితం అయితే దాన్ని ఆయన నచ్చిన వాళ్లకు ఇవ్వొచ్చు. ఒకవేళ ఆయన వీలునామా రాయకుండా చనిపోతే తదనంతరం వారి పిల్లలు స్వార్జితానికి, పిత్రార్జితానికి కూడా హక్కుదారులు అవుతారు. అది ఆయన పిత్రార్జితం అయితే మీరో పని చేయొచ్చు. మీ భర్త భాగాన్ని పంచి ఇవ్వమని మైనర్ అయిన బాబు తరఫున మీరు భాగస్వామ్య దావా వేయండి. నిజానికి వారు పంచి ఇచ్చే వరకూ వేచి చూడాల్సిన అవసరం లేకుండా వ్యాజ్యం వేయొచ్చు. లేదంటే మీ ఇద్దరి పోషణ నిమిత్తం మీ మామయ్య మీద మెయింటెనెన్స్ కేసు వేయండి. అందులోనేే... మీరు పెళ్లప్పుడు ఇచ్చిన కట్నకానుకల ప్రస్తావనను చేర్చి వాటిని తిరిగి ఇవ్వమని కోరవచ్చు. లేదా గృహహింస చట్టం కింద పరిహారం కోరుతూ అందులో మీరు ఇచ్చిన కట్నకానుకలు, మీ తల్లీబిడ్డల పోషణ ఖర్చులనూ చేర్చవచ్చు. ఇవేవీ కాకుండా..ముందే మీ వారి వాటా పంచుకుని ఉంటే తప్పని సరిగా మీకూ వాటా ఇవ్వాలి. ముందు ఆ ఆస్తి వివరాలు సంపాదించి కేసు వేయండి. లాయర్‌ని పెట్టుకునే స్థోమత లేకపోతే లీగల్ సర్వీసెస్ అథారిటీ వారిని సంప్రదించొచ్చు. వారు ఏర్పాటు చేసిన న్యాయవాది ద్వారా ప్రీ లిటిగేషన్ కేసు ద్వారా పరిష్కారం చేసుకోవచ్చు. ఇవన్నీ మీ పెళ్లికి ముందే చేస్తే మంచిది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.