పదే పదే తప్పులు చేస్తున్నా!
అకౌంట్స్‌లో మూడేళ్లుగా పనిచేస్తున్నా. ఏడాదిగా ప్రతి కొన్ని వారాలకోసారి ఆడిటింగ్‌లో తప్పులు దొర్లుతున్నాయి. దీంతో బాస్‌తో చీవాట్లు. నామీద నాకే కోపం వస్తోంది. గతంలో మా బాస్‌కి నచ్చే దాన్ని. ఇప్పుడు ఆమె నాపై చిరాకు పడటమూ గమనించా. పూర్తి శ్రద్ధపెట్టి పనిచేయడానికి ప్రయత్నించా
అకౌంట్స్‌లో మూడేళ్లుగా పనిచేస్తున్నా. ఏడాదిగా ప్రతి కొన్ని వారాలకోసారి ఆడిటింగ్‌లో తప్పులు దొర్లుతున్నాయి. దీంతో బాస్‌తో చీవాట్లు. నామీద నాకే కోపం వస్తోంది. గతంలో మా బాస్‌కి నచ్చే దాన్ని. ఇప్పుడు ఆమె నాపై చిరాకు పడటమూ గమనించా. పూర్తి శ్రద్ధపెట్టి పనిచేయడానికి ప్రయత్నించా. అయినా చిన్న చిన్న తప్పులు దొర్లుతూనే ఉన్నాయి. ఇది నాకు తగదేమో, వేరేది ప్రయత్నించడం మేలేమో అనిపిస్తోంది. ఏమంటారు?
- ఓ సోదరి, విజయవాడ
పనిలో తప్పులు సహజమే. కానీ ఇంత తక్కువ పరిధిలో చేస్తుండటమే ఆశ్చర్యకరం. ఇది ఇలాగే కొనసాగితే మీ ఉద్యోగమూ ప్రమాదంలో పడుతుంది. మీ ఇద్దరి సంభాషణ ఎలా సాగుతోందో స్పష్టత ఇవ్వలేదు. కానీ గమనిస్తే.. అది మీపై, మీ పని తీరుపై ఆమె చూసే దృష్టికోణంపై ప్రభావం చూపిస్తుందని అనిపిస్తోంది. కాబట్టి, ఆమె హెచ్చరికలను సీరియస్‌గా తీసుకోండి. లేదంటే మీ పనితీరుపై ఇచ్చే రివ్యూపైనా ప్రభావం చూపిస్తుంది. ఇక్కడ రెండు కోణాలున్నాయి.
* ఉద్యోగంపై ఇష్టం, సంతృప్తి ఉంటే.. తప్పులెందుకు చేస్తున్నారో గుర్తించండి. వేగంగా పనిచేయడం, పరధ్యానం, పనివేళల్లో సంగీతం వినడం, సామాజిక మాధ్యమాలు, మెసేజ్‌లను చూడటం, తికమకపడటం.. ఇలాంటివేమైనా ఉంటే.. మార్చుకోండి. సందేహాలుంటే ముందుగానే అడిగి, సూచనలు తీసుకోండి. పని పూర్తయ్యాక ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవడమూ అలవాటు చేసుకోండి.
* అలసట, పని పట్ల విసుగు, ఒకే పనిని పదేపదే చేస్తున్నట్లు అనిపిస్తే.. సరిగా నిద్ర పోవడంపై దృష్టిపెట్టడం, చిన్న చిన్న విరామాలు తీసుకోవడం చేయాలి. పని తీరులో చేసుకునే కొద్దిపాటి మార్పులు కూడా తప్పులను నివారిస్తాయి.
ఉద్యోగం నచ్చకపోతే, తగిన అర్హత మీకు లేదని భావిస్తే.. మరొక దానికి ప్రయత్నించండి. ప్రస్తుతం మీ బాస్ మీ తప్పులను క్షమిస్తుండొచ్చు. కానీ పరిధి దాటితే మీకెప్పటికీ మంచిది కాదు. మరోమాట... సరైన ఆర్థిక వనరులు ఉన్నాయనిపిస్తే తప్ప ఉద్యోగాన్ని వదులుకోవద్దు. ప్రస్తుత నిరుద్యోగ రేటుతో పోలిస్తే కొత్తదాన్ని వెతుక్కోవడానికి చాలా సమయమే పడుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.