చదువు పూర్తయినా ఫలితం లేదు!

నేను గృహిణిని. నా కళ్ల కింద చాలా నల్లగా ఉంది. చదువుకునే సమయంలో మొదలైంది. పూర్తయ్యి ఎనిమిదేళ్లవుతున్నా ఆ నలుపు తగ్గడం లేదెందుకు?

Published : 22 Aug 2021 00:50 IST

నేను గృహిణిని. నా కళ్ల కింద చాలా నల్లగా ఉంది. చదువుకునే సమయంలో మొదలైంది. పూర్తయ్యి ఎనిమిదేళ్లవుతున్నా ఆ నలుపు తగ్గడం లేదెందుకు?

- ఓ సోదరి, విజయవాడ

దువుకీ, దీనికీ సంబంధమేమీ ఉండదు. నల్లటి వలయాలు వంశపారంపర్యం. నిజానికి ఈ సమస్య మనకి ముఖ్యంగా దక్షిణ భారతీయుల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఎక్కువ నిద్ర పోకపోవడం, టీవీ, మొబైళ్లను ఉపయోగించడం, గంటలకొద్దీ పనిచేయడం ఎక్కువయ్యేలా చేస్తాయి.  కొందరిలో ఎటోపిక్‌ డెర్మటైటిస్‌ ఉంటుంది. వీళ్లు కళ్లు ఊరికే నలుపుతుంటారు. దాంతో కళ్ల కింద నల్లటి వలయాలొస్తుంటాయి. ఎక్కువగా ఎండలో తిరిగినా, సైనసైటిస్‌, కాంటాక్ట్‌ డెర్మటైటిస్‌, సౌందర్య ఉత్పత్తులు పడకపోవడం, ఎనీమియా వంటివీ సమస్యను పెద్దవి చేసేవే. చిన్న వయసులో కనిపించదు కానీ, వయసు పెరిగేకొద్దీ కొలాజిన్‌ తగ్గి బయటపడుతుంది. ఆస్తమా, అలర్జీలు, డీహైడ్రేషన్‌ ఉన్నవారికీ సాధారణమే. కీరదోస ముక్కలను ఫ్రిజ్‌లో పెట్టి, వాటితో కళ్లకింద రుద్దాలి. ఆలూ రసాన్ని కళ్లకింద రాసి, 10 నిమిషాల తర్వాత కడిగేయాలి. నిమ్మ రసం, రోజ్‌వాటర్‌ టేబుల్‌ స్పూను చొప్పున తీసుకుని, రోజు మొత్తమ్మీద 7-8 సార్లు దూదితో ఆ ప్రాంతంలో అద్దుతుండాలి. ఒక టేబుల్‌ స్పూను టొమేటో రసానికి 2-3 చుక్కల నిమ్మరసాన్ని కలిపి రాయడం లేదా మెంతుల పిండిలో తగినంత నారింజ రసాన్ని కలిపి ప్యాక్‌లా కళ్ల కింద ప్యాక్‌లా పెట్టుకోవడం చేయొచ్చు. పది నిమిషాల తర్వాత కడిగేస్తే సరి. వీటితోపాటు మెడికల్‌ ట్రీట్‌మెంట్‌కీ ప్రాధాన్యమివ్వాలి. సన్‌స్క్రీన్‌ తప్పకవాడాలి. విటమిన్‌ సి, లైకోరైజ్‌ ఉన్న క్రీమ్‌లనే ఉపయోగించాలి. ఇవన్నీ చాలావరకూ తగ్గడానికి సాయపడతాయి. సరైన ఆహారం, నిద్రతోపాటు కళ్లు నలపకుండా చూసుకోవాలి. డార్క్‌ చాక్లెట్‌, వాల్‌నట్స్‌, చేపలను ఎక్కువగా తీసుకుంటే మంచిది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని