ఫ్రెండ్స్‌ను కలిసొస్తానని చెప్పి అతడి దగ్గరికెళ్తోంది... 

మీ సుదీర్ఘ లేఖతో మీరెంత ఆవేదన చెందుతున్నారో అర్థమైంది. మీ అమ్మాయిలో వయసుకు తగినంత పరిపక్వత, లోకజ్ఞానం, లేవనిపిస్తోంది. లాక్‌డౌన్‌కి ముందు స్నేహితులను కలిసేది కనుక అన్నీ తెలుసుకుంటూ బాగుండేది. ఇప్పుడా వాతావరణం లేనందున వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లకు అలవాటుపడి ఉంటుంది. వాటిలో అతడు చెప్పే ప్రేమ కబుర్లు, వయసు ప్రభావంతో కలిగే కోరికలతో అతడికి లొంగిపోయింది....

Updated : 10 Oct 2021 17:43 IST


మా అమ్మాయి ఓ కుర్రాణ్ణి ఇష్టపడుతోంది. కోప్పడినా, కొట్టినా మానలేదు. ఫ్రెండ్స్‌ను కలిసొస్తానని చెప్పి అతడి దగ్గరికెళ్తుంది. అతడితో వెళ్లిపోతానంటోంది. ఏడాది నుంచి మా ఇల్లు అల్లకల్లోలమైంది. పరిష్కారం చెప్పండి ప్లీజ్‌...

- ఓ సోదరి


మీ సుదీర్ఘ లేఖతో మీరెంత ఆవేదన చెందుతున్నారో అర్థమైంది. మీ అమ్మాయిలో వయసుకు తగినంత పరిపక్వత, లోకజ్ఞానం, లేవనిపిస్తోంది. లాక్‌డౌన్‌కి ముందు స్నేహితులను కలిసేది కనుక అన్నీ తెలుసుకుంటూ బాగుండేది. ఇప్పుడా వాతావరణం లేనందున వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లకు అలవాటుపడి ఉంటుంది. వాటిలో అతడు చెప్పే ప్రేమ కబుర్లు, వయసు ప్రభావంతో కలిగే కోరికలతో అతడికి లొంగిపోయింది. తోచిందే నిజమనుకుని సమర్థించుకుంటోంది. ఇప్పుడు మీరేం చెప్పినా అతన్ని దూరం చేసేందుకే అనుకుంటుంది. ఈ పరిస్థితుల్లో వాదించకుండా ‘సరే ఇష్టపడుతున్నావు కదా! ఆలోచిద్దాం’ అని కాలయాపన చేయండి. ఇంట్లో వాళ్ల మాట వినరు కనుక ఆమెకిష్టమైన వారి సాయంతో ‘అసలు నీ లక్ష్యాలేంటి? ఏం చేద్దామనుకుంటున్నావు, ముందు నీలో ఎంత పరిపక్వత ఉందో తెలుసుకుందాం’ అని ఒప్పించి సైకియాట్రిస్టు దగ్గరికి తీసికెళ్లండి. వారు ఆమె మానసిక స్థితి, తెలివితేటలు, వ్యక్తిత్వం, జీవితంలో సర్దుబాట్లు చేసుకోగలదా లాంటివన్నీ ఎనలైజ్‌ చేసి, ఊహాలోకం నుంచి వాస్తవంలోకి వచ్చేలా కౌన్సెలింగ్‌ ఇస్తారు. ఎలాంటి ఆపదలు వచ్చే అవకాశం ఉందో స్నేహపూరిత మాటలతో వివరించి తగిన నిర్ణయాలు తీసుకునేలా చేస్తారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని