వరుసగా అబార్షన్లు!.. పిల్లల కోసం మళ్లీ ప్రయత్నించొచ్చా?
నాకు 30. పెళ్లై 14 ఏళ్లవుతోంది. మొదటి కాన్పు సహజ ప్రసవం. రెండో సారి అధిక రక్తస్రావమై బిడ్డ కడుపులోనే చనిపోయాడు. ఆ తర్వాతా అదే సమస్యతో ఆరు, ఏడు, ఎనిమిది నెలల్లో అబార్షన్లు
నాకు 30. పెళ్లై 14 ఏళ్లవుతోంది. మొదటి కాన్పు సహజ ప్రసవం. రెండో సారి అధిక రక్తస్రావమై బిడ్డ కడుపులోనే చనిపోయాడు. ఆ తర్వాతా అదే సమస్యతో ఆరు, ఏడు, ఎనిమిది నెలల్లో అబార్షన్లు అయ్యాయి. ఇవన్నీ జరిగి మూడేళ్లవుతోంది. ఆరు నెలలుగా నెలసరిలో తీవ్ర రక్త స్రావమవుతోంది. రక్తం గడ్డలు పడుతున్నాయి. గర్భాశయంలో వాపు, హిమోగ్లోబిన్ శాతం చాలా తక్కువగా ఉన్నాయని వైద్యులు చెప్పారు. పిల్లల కోసం మళ్లీ ప్రయత్నించొచ్చా?
- ఓ సోదరి, వికారాబాద్
గర్భం దాల్చిన ప్రతిసారీ ఎక్కువగా బ్లీడింగ్ అవుతోందంటే ఏదో తీవ్ర సమస్యే ఉందని అర్థమవుతోంది. ఇలా జరగడానికి గర్భాశయం, ప్లసెంటాకు సంబంధించిన సమస్యలు లేదా శరీరంలో వ్యాధి నిరోధక వ్యవస్థలో లోపాలు (ఆటో ఇమ్యూన్ డిసీజ్), ఆప్లా సిండ్రోమ్ (ఏపీఎల్ఏ సిండ్రోమ్ ), సిస్టమిక్ లూథాన్స్ ఎరిథెమాటోసస్ (ఎస్ఎల్ఇ), మూత్రపిండాలు, కాలేయ సమస్యలు... ఇలాంటివి ఏవైనా కారణం కావొచ్చు. మీరు హిమోగ్లోబిన్ శాతం పెరగడానికి మందులు వాడటం, గర్భాశయ వాపునకు చికిత్స తీసుకోవడం ముఖ్యం. ఇప్పుడు కూడా మీరు సంతానం కోసం ప్రయత్నించాలనుకుంటే పరీక్షలు చేయించుకుని సమస్య ఏమిటో తెలుసుకున్నాకే ఓ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది.
దీని కోసం 3డీ/4డీ ట్రాన్స్ వెజైనల్ స్కాన్, కిడ్నీ స్కాన్ యాంటీబాడీస్, హోమోసిస్టిన్ పరీక్షలు, మధుమేహం, కిడ్నీ, లివరు ఫంక్షనల్ పరీక్షలు... ఇవన్నీ చేయించుకోవాలి. మీ ఉత్తరాన్ని బట్టి బిడ్డల్లో లోపాల వల్ల ఇలా అయ్యిందని అనిపించడం లేదు. మీ భార్యాభర్తలిద్దరూ ఓసారి క్రోమోజోమ్ పరీక్షలు చేయించుకుంటే మంచిది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- గోళ్లు విరుగుతున్నాయా?
- పసిడి మెరుపులు... పంచలోహ పట్టీలు!
- మెడ చుట్టూ నల్లగా అవుతోందా?
- Summer Beauty: మేకప్ చెదిరిపోకుండా..!
- జుట్టుకు జామాకు!
ఆరోగ్యమస్తు
- ఆరుబయట ఆడుతున్నారా..!
- Mangoes: అందుకే తినేముందు నీళ్లలో నానబెట్టాలి!
- నొప్పులు తగ్గించే నిమ్మగడ్డి...
- బెల్లంతో ప్రయోజనాలెన్నో!
- బిగుతు దుస్తులతో సమస్యా?
అనుబంధం
- దాంపత్య బంధానికీ.. ఇవ్వాలి కాస్త విశ్రాంతి!
- బాస్ వివాహేతర సంబంధం.. అతడితో చెప్పాలా? వద్దా?
- నైపుణ్యాలకు సానపెట్టండిలా..
- నేనంటే ప్రాణమంటోంది.. కానీ!
- ‘ఇంటి నుంచి వెళ్లిపో’ అంటున్నాడు..!
యూత్ కార్నర్
- ప్రాణం కోసం... ‘సూర్య నాయక్’
- Prachi Nigam: స్టేట్ ఫస్ట్.. అయినా బాడీ షేమింగ్ తప్పలేదు!
- Janhvi Kapoor : నచ్చిందే పదే పదే తింటుంటా!
- ఆ సమయంలో... అయిదేళ్ల పిల్లనైపోతా!
- కేరళ కుట్టికి... ‘టీన్’ కిరీటం!
'స్వీట్' హోం
- ప్రకృతికి కోపం తెప్పిస్తున్నారా?
- ఎయిర్ ప్యూరిఫయర్కు బదులు ఇవి!
- వంటింట్లో కీటకాల బెడదా..
- పొందికగా... సర్దేయొచ్చు!
- ఈ బాక్సులు బుజ్జాయిలకెంతో ఇష్టం..!
వర్క్ & లైఫ్
- నేను బాగా పనిచేయడం లేదు!
- గెలవాలంటే నేర్చుకోవాలి..
- మళ్లీ పెళ్లి వద్దంటోంది..!
- ప్రతిసారీ మర్చిపోతున్నారా?
- కొత్త ఉద్యోగంలో కొన్ని విషయాలు...