నేను పెళ్లి చేసుకుంటే... నా చిట్టితల్లి ఏమవుతుందో!

పెళ్లైన ఏడాదికే నా భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. అప్పటికి గర్భవతిని. ఇప్పుడు పాపకు మూడేళ్లు. ఈ దిగులుతో అమ్మా చనిపోయింది. ఈమధ్యే నాన్న ఓ సంబంధం చూశారు. అతనికో బాబు. ఆ బాబుకి తల్లిని  కాగలను. కానీ నా కూతురికి అతను తండ్రి కాగలడా? లేదంటే నా చిట్టితల్లి భవిష్యత్తు ఏమవుతుంది? తేల్చుకోలేక పోతున్నాను....

Published : 28 Aug 2021 00:32 IST

పెళ్లైన ఏడాదికే నా భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. అప్పటికి గర్భవతిని. ఇప్పుడు పాపకు మూడేళ్లు. ఈ దిగులుతో అమ్మా చనిపోయింది. ఈమధ్యే నాన్న ఓ సంబంధం చూశారు. అతనికో బాబు. ఆ బాబుకి తల్లిని  కాగలను. కానీ నా కూతురికి అతను తండ్రి కాగలడా? లేదంటే నా చిట్టితల్లి భవిష్యత్తు ఏమవుతుంది? తేల్చుకోలేక పోతున్నాను.  

- ఓ సోదరి, కాకినాడ


పెళ్ల్లి మీకు ఇష్టం లేకుండా మీ నాన్నగారు బలవంతంగా కుదిరిస్తే మాత్రం మరోసారి ఆలోచించండి. మీరు అతని బాబుని మీ బాబుగా అనుకుంటున్నప్పుడు అతనూ మీ పాపను తన పాపలా అంగీకరించాలని ముందే మాట్లాడండి. తారతమ్యం చూపకూడదు. తోబుట్టువుల్లా ఉండేలా పిల్లలిద్దర్నీ ముందుగానే సిద్ధం చేయాలి. ఇద్దరూ ఇద్దరికీ తల్లిదండ్రుల్లా వ్యవహరించాలనే నియమం ఉంటేనే పెళ్లి చేసుకోండి. పిల్లలకి స్నేహభావం కలిగేలా మీ నలుగురూ అప్పుడప్పుడూ కలుస్తూ ఉండండి. అనుబంధం తృప్తిగా ఉంది అనిపిస్తేనే పెళ్లి చేసుకోండి. చేసుకున్నాక సరి పడకపోవడం, విడిపోవడం లాంటివి జరక్కూడదు. నలుగురూ మానసికంగా సిద్ధం అవ్వడం చాలా ముఖ్యం. ఒకరితో ఒకరు స్నేహంగా, సంతృప్తిగా ఉండగలరు అనిపించాలి. రెండువైపులా సర్దుబాటు అవుతుంది అని నమ్మకం కలగాలి. మీ ఇద్దరూ విశాల దృక్పథంతో పిల్లల్ని సమానంగా చూడగలమనుకుంటే సంసారం సజావుగా సాగిపోతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని