అప్పుడలా.. ఇప్పుడిలా.. ఏం చేయను?
రెండేళ్ల క్రితం నెలలో కొన్ని రోజులైనా వర్క్ ఫ్రం హోం ఇవ్వమని ఆఫీసులో కోరాను. అప్పుడేమో ఇవ్వలేదు. లాక్‌డౌన్ తర్వాత ఇంటి నుంచి పనే తప్పని సరైంది. తిరిగి ఎప్పటి నుంచి ఆఫీసుకు వెళ్లొచ్చన్న దానిపై బాస్ స్పష్టత ఇవ్వట్లేదు. ఆఫీస్, ఇంటి పని, పిల్లల ఆన్‌లైన్ తరగతులు.. వగైరా భారంలా తోస్తోంది. ఏం చేయను?...
రెండేళ్ల క్రితం నెలలో కొన్ని రోజులైనా వర్క్ ఫ్రం హోం ఇవ్వమని ఆఫీసులో కోరాను. అప్పుడేమో ఇవ్వలేదు. లాక్‌డౌన్ తర్వాత ఇంటి నుంచి పనే తప్పని సరైంది. తిరిగి ఎప్పటి నుంచి ఆఫీసుకు వెళ్లొచ్చన్న దానిపై బాస్ స్పష్టత ఇవ్వట్లేదు. ఆఫీస్, ఇంటి పని, పిల్లల ఆన్‌లైన్ తరగతులు.. వగైరా భారంలా తోస్తోంది. ఏం చేయను?
- ఓ సోదరి
చాలామందిది ఇదే పరిస్థితి. ఇంటి నుంచి ఎక్కువ గంటల పని, దీనికి తోడు పిల్లల చదువు, బాగోగులు చూడటం భారం పెంచే విషయమే. దీన్ని కొంచెం ప్రణాళికబద్ధంగా చేసుకుంటే పరిష్కారం సులువవుతుంది.
* రోజూ ఉదయాన్నే పెద్ద పిల్లలైతే అసైన్‌మెంట్లు, క్లాసులు, చదవాల్సిన వాటితో టైంటేబుల్ వేసుకోవడం అలవాటు చేయండి. చిన్నపిల్లలైతే తరగతులతోపాటు ఆర్ట్స్, క్రాఫ్ట్స్, పజిల్స్‌తో షెడ్యూల్ తయారు చేసివ్వండి. మొత్తంగా స్కూలు విధానాన్ని అనుసరించే ప్రయత్నం చేయండి.
* పిల్లలకు మీ పర్యవేక్షణ తప్పనిసరి అయితే.. మీ పరిస్థితుల్లో ఉన్న ఇంకొకరి సాయం తీసుకోండి. కొంత సమయం మీరు చూసుకుంటే.. మీరు పని చేస్తున్నప్పుడు వాళ్లు బాధ్యత తీసుకునేలా ఉండాలి. దీని వల్ల కొన్ని గంటలైనా ప్రశాంతంగా పనిచేసుకోవచ్చు.
* మీలాగే మీ సహోద్యోగుల్లోనూ వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు/ అత్తమామల్నో, పిల్లల్నో చూసుకోవాల్సి రావొచ్చు. కాబట్టి, మీ పరిస్థితిని ముందుగానే చెప్పండి. ప్రస్తుత పరిస్థితుల్లో వాళ్లూ అర్థం చేసుకుంటారు. చిన్న పాప కారణంగా వీడియో కాల్ సమయంలో అంతరాయం కలిగే అవకాశముండటం, ఇంట్లో వాళ్లని ఆసుపత్రికి తీసుకెళ్లడం.. ఇలా కారణమేదైనా అది మీ మీటింగ్ సమయం ఆలస్యం అయ్యేలా ఉంటే నిర్భయంగా చెప్పండి. పని పూర్తిచేయాల్సిన డెడ్‌లైన్ గురించి ముందుగానే తెలుసుకోండి.
ఆ సమయంలోగా పూర్తి చేయలేకపోయినా మొదట్లోనే చెప్పేయండి. అవసరమైతే ఇంకాస్త సమయం అడగండి. కానీ.. ఏదైనా ఆఖరి నిమిషం వరకూ వేచి ఉండొద్దు. ఈ విషయాన్ని గుర్తుంచుకుంటే చాలు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.