ఒకప్పటి కల.. ఇప్పుడు ద్వేషం

గత ఏడాది మార్చి నుంచి వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తున్నా. ఇద్దరు పిల్లలకూ ఆన్‌లైన్‌ తరగతులే. మా వారు వారానికి మూడు, నాలుగు సార్లు ఆఫీసుకు వెళతారు. ఒకప్పుడు ఇంటి నుంచి పనిచేయడం నా కల. కానీ ఇప్పుడు అలసిపోయాను. ఒకరకంగా ద్వేషిస్తున్నా కూడా. సంస్థ పరంగా తిరిగి ప్రారంభించేలా కనిపించడం లేదు.

Updated : 16 Sep 2021 04:50 IST

గత ఏడాది మార్చి నుంచి వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తున్నా. ఇద్దరు పిల్లలకూ ఆన్‌లైన్‌ తరగతులే. మా వారు వారానికి మూడు, నాలుగు సార్లు ఆఫీసుకు వెళతారు. ఒకప్పుడు ఇంటి నుంచి పనిచేయడం నా కల. కానీ ఇప్పుడు అలసిపోయాను. ఒకరకంగా ద్వేషిస్తున్నా కూడా. సంస్థ పరంగా తిరిగి ప్రారంభించేలా కనిపించడం లేదు. పిచ్చెక్కి పోతోంది. ఏం చేయను?

- శ్రేష్ఠ, బెంగళూరు

ది మీ ఎంపిక కాకపోవడం మొదటి సమస్య. సంస్థకు వెళ్లి, నచ్చినట్లుగా చేసే అవకాశం లేదు. దీంతో చిరాకు, విసుగు సాధారణమే. ముందుగా మీటింగ్‌ సమయం, ప్రాజెక్టులు మొదలైన అంశాలపై నియంత్రణ తెచ్చుకోండి. చేయాలనుకునే పనుల క్రమాన్ని నచ్చినట్లుగా నిర్దేశించుకోండి. విరామాలనూ ప్లాన్‌ చేసుకోండి. అప్పుడు మీకు నచ్చిన విధానంలో పని సాగుతోందన్న భావన కలుగుతుంది.

* కొన్ని పనులు ఆఫీసులో వాటంతటవే జరిగిపోతాయి. కానీ ఇప్పుడు సమన్వయ లోపం కొంత అలసటకు కారణమవుతుంది. ఆఫీసులో అయితే మీటింగ్‌ గదికి వెళ్లేసరికి కొంత సమయం ఉంటుంది. ఈలోగా కొన్ని ఆలోచనలు చేసుకునే వీలుండేది. ఇంట్లో ఆ వీలు తక్కువ కాబట్టి సమస్యగా తోస్తోంది. వీటి గురించి పెద్దగా ఆలోచించకండి. కొత్త విధానం, టెక్నాలజీల కారణంగా అలా అనిపిస్తోంది. ఒకసారి పట్టు తెచ్చుకుంటే సులువవుతుంది. ఓపిగ్గా నేర్చుకోవాలంతే.

* పనిచోట అందరూ స్నేహితులే కాకపోయినా పాంట్రీలోనో మరో ప్రదేశంలోనూ కనీస పలకరింపులుంటాయి. కలిసి పనిచేయని వారితోనూ మాట కలుపుతుంటాం. ఇంటినుంచి పనిలో ఆ అవకాశం ఉండదు. ఫోన్లన్నీ పనికి సంబంధించినవే అవుతాయి. కాబట్టి, వాళ్లని మిస్‌ అవుతుండొచ్చు. పని వాతావరణంలో సామాజిక బంధాలు అత్యంత ప్రధానం. ఈ అవకాశాలన్నీ కోల్పోవడమూ అలసటగా భావించడానికి కారణాలే. ఇందుకు.. ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా సహోద్యోగులతో మాట కలిపే ప్రయత్నం చేయండి.

* కొత్త ఒత్తిళ్లూ కారణమవొచ్చు. గతంతో పోలిస్తే బాధ్యతలు పెరగడం, కొత్త రుచులు సిద్ధం చేయడం, పిల్లల పని, వాళ్లని ఆడించడం, ఇంటి పనీ వీటికి తోడు ఆఫీసు బాధ్యతలు. అందుబాటులో ఉన్న సమయం ఒకటే అయినా.. పూర్తి చేయాల్సినవి బోలెడు. కాబట్టే విసుగు. సానుకూలంగా ఉండటంతోపాటు కృతజ్ఞతగా భావించే అంశాలపై దృష్టిపెట్టడమే దీనికి సరైన పరిష్కారం. ఇవి శరీరంపైనే కాదు.. మనసుపైనా సానుకూల ప్రభావం చూపుతాయి.

ఇప్పుడు ఇవన్నీ సమస్యగా తోయొచ్చేమో కానీ.. శాశ్వతం మాత్రం కాదు. రేపు ఇవే సాధారణమవొచ్చు లేదా భవిష్యత్‌లో కొత్తవి నేర్చుకునేలా చేసే సంసిద్ధతగానూ మారొచ్చు. కాబట్టి, సానుకూలంగా ఉండే ప్రయత్నం చేయండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని