నల్లమచ్చ తగ్గడంలేదు

ముక్కు మీద నల్ల మచ్చలా వచ్చింది. నెమ్మదిగా తగ్గుతుందని చెప్పడంతో చికిత్సేమీ తీసుకోలేదు. ఎన్నాళ్లయినా తగ్గడం లేదు. ఏం చేయాలి?

Published : 19 Sep 2021 18:19 IST

ముక్కు మీద నల్ల మచ్చలా వచ్చింది. నెమ్మదిగా తగ్గుతుందని చెప్పడంతో చికిత్సేమీ తీసుకోలేదు. ఎన్నాళ్లయినా తగ్గడం లేదు. ఏం చేయాలి? - రాధిక, గుంటూరు

దీన్ని మెలాస్మా అనీ అంటాం. చాలా సాధారణ సమస్య. బూడిద, బ్రౌన్‌ రంగుల్లో వస్తుంటుంది. కొందరిలో ముక్కు, చెంపలు, నుదురు వంటి ప్రదేశాలకే పరిమితమైతే మరికొందరికి ముఖమంతా వ్యాపిస్తుంటుంది కూడా. ఇది ఎక్కువగా వంశ పారంపర్యం. వయసు పెరిగేకొద్దీ వస్తుంటుంది. ప్రెగ్నెన్సీలో హార్మోనుల్లో మార్పులు, మెనోపాజ్‌ తర్వాత, గర్భనిరోధక మాత్రలు వాడే వాళ్లలో ఎక్కువ. హైపో థైరాయిడిజం, ఫిట్స్‌ మందులు వాడేవారు, గ్యాడ్జెట్ల అతి వాడకం, ఎండల్లో ఎక్కువగా తిరగడం, అదే పనిగా కూర్చుని ఉండటమూ కారణమే. కొన్ని సార్లు సౌందర్య ఉత్పత్తులూ కారణమవుతుంటాయి. ఒక్కోసారి దానంతట అదే పోతుంది. కొన్నిసార్లు జీవితాంతం ఉండొచ్చు. ఏ స్థాయిలో ఉందన్న దాన్ని బట్టి తగ్గడం ఆధారపడి ఉంటుంది. హైడ్రోక్వినాన్‌, అజిలాయిక్‌ యాసిడ్‌, కోజిక్‌ యాసిడ్‌, స్టీమైన్‌, ఆల్ఫాహైడ్రాక్సీ యాసిడ్స్‌, థనాస్మిక్‌ యాసిడ్‌, ట్రెటినాయిన్‌, విటమిన్‌ సి, ఆర్బిట్యున్‌, గ్లుటథయాన్‌, కోజిక్‌ యాసిడ్‌, జింక్‌ సల్ఫేట్‌ క్రీములు రాయొచ్చు. 3-4 వారాలు రాసి ప్రభావం కనిపిస్తే కొనసాగించొచ్చు. సన్‌స్క్రీన్‌నూ తప్పక రాయాలి. వీటికీ తగ్గకపోతే మైక్రోడర్మాబ్రేషన్‌, కెమికల్‌ పీల్‌, లేజర్‌ ట్రీట్‌మెంట్‌, లైట్‌ థెరపీలు చేస్తాం. మంచి ఆహారంతోపాటు తగినన్ని నీటినీ తీసుకుంటుండాలి. కానీ ఇవన్నీ తక్కువ స్థాయిలో ఉన్నప్పుడే సాధ్యం. మరీ తీవ్రంగా ఉంటే పూర్తిగా తగ్గే అవకాశాలు తక్కువ.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని