కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరాయిడ్స్ ఆహారంతో తగ్గించుకోవచ్చా?
నా వయసు 40. బరువు 60 కిలోలు. ఎత్తు 5.2. ఫుల్ బాడీ చెకప్ చేయించుకుంటే రక్తంలో ఎక్కువ కొలెస్ట్రాల్‌తోపాటు 600 ట్రైగ్లిసరాయిడ్స్ ఉన్నాయన్నారు. రక్తంలో వీటి స్థాయులు సాధారణంగా ఎంత ఉండాలి? తగ్గించుకోవడానికి ఆహారంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి?
నా వయసు 40. బరువు 60 కిలోలు. ఎత్తు 5.2. ఫుల్ బాడీ చెకప్ చేయించుకుంటే రక్తంలో ఎక్కువ కొలెస్ట్రాల్‌తో పాటు 600 ట్రైగ్లిసరాయిడ్స్ ఉన్నాయన్నారు. రక్తంలో వీటి స్థాయులు సాధారణంగా ఎంత ఉండాలి? తగ్గించుకోవడానికి ఆహారంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి?
- ఓ సోదరి
సాధారణంగా రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయులు, 200 ఎంజీ/డీఎల్ మించకూడదు. ట్రైగ్లిసరాయిడ్స్ 150ఎంజీ/డీఎల్ మించొద్దు. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయులు కొవ్వు శాతం ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకున్నా లేదా శరీరానికి అవసరమైన శక్తి కంటే ఎక్కువ ఆహారం తీసుకున్నా పెరుగుతాయి. తేలికగా జీర్ణమయ్యే పిండిపదార్థాలు, ఎక్కువగా తీపి పదార్థాలు తీసుకోవడం వల్ల లేదా మధుమేహుల్లో చక్కెర నియంత్రణలో లేకపోవడం వల్ల ట్రైగ్లిజరాయిడ్స్ పెరిగిపోతాయి. రక్తంలో కొవ్వు నిల్వలు ఎక్కువగా ఉన్నప్పుడు గుండె జబ్బులు రావొచ్చు. కాబట్టి రక్తంలో కొవ్వు నిల్వలు సాధారణ స్థాయిలో ఉంచుకోవాలి.
ఎలా తగ్గించుకోవాలి? మీరు ఐదు కిలోల వరకు బరువు తగ్గాలి. ఇందుకోసం... నిదానంగా జీర్ణమయ్యే పిండి పదార్థాలు... అంటే పొట్టుతో ఉన్న గింజ ధాన్యాలు (దంపుడు బియ్యం, జొన్నలు, రాగులు, సజ్జలు, ఓట్స్, పొట్టుతో ఉన్న గోధుమ పిండి) వాడాలి. ఇవి మూడు పూటలకూ కలిపి 270 గ్రా. మించ కూడదు. రోజుకు 40 గ్రా. పీచు తీసుకోవాలి.
ఆకు కూరలు (100 గ్రా.), కూరగాయలు (200 గ్రా.) ఉండేలా చూసుకోవాలి. పీచు ఎక్కువగా ఉండే జామ, పైనాపిల్, పిండి పదార్థం శాతం తక్కువగా ఉండే తర్బూజ, బత్తాయి, నారింజ, నేరేడు, దానిమ్మ, పచ్చి అంజీరాలను తీసుకోవాలి. ఎండు ఖర్జూరాలు, ఎండు ఫలాలు బాగా తగ్గించాలి. చక్కెరలు ఉండే సపోటా, ద్రాక్ష, అరటిపండ్లను మోతాదులో తీసుకోవాలి. నూనెలు... రోజుకు 4- 6 చెంచాలు (దాదాపు 27 ఎం.ఎల్.) వాడుకోవచ్చు. నువ్వులు, సోయా, ఆవ, సెనగ నూనెలు వాడొచ్చు. ఎక్కువ సేపు వేయించిన పదార్థాలు శరీరానికి హానికరం. చక్కెర, బెల్లం, తేనె ఏదైనా రోజుకు రెండు చెంచాలే వాడాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- విజయానికి అందం అడ్డయ్యింది!
- ఈ ఆహారంతో జుట్టు ఆరోగ్యంగా..!
- మెడ చుట్టూ నల్లగా అవుతోందా?
- గోళ్లు విరుగుతున్నాయా?
- పసిడి మెరుపులు... పంచలోహ పట్టీలు!
ఆరోగ్యమస్తు
- ఎలక్ట్రోలైట్స్... తాగుతున్నారా?
- భవిష్యత్తుపై బెంగతో నిద్రపోవట్లేదట...
- హార్మోన్లు సమతులంగా ఉండాలంటే..!
- Mangoes: అందుకే తినేముందు నీళ్లలో నానబెట్టాలి!
- ఆరుబయట ఆడుతున్నారా..!
అనుబంధం
- రంగులు తెలిసేలా!
- లవ్ మ్యారేజ్.. అయినా సంప్రదాయాల పేరిట టార్చర్ చేస్తున్నాడు..!
- దాంపత్య బంధానికీ.. ఇవ్వాలి కాస్త విశ్రాంతి!
- బాస్ వివాహేతర సంబంధం.. అతడితో చెప్పాలా? వద్దా?
- నైపుణ్యాలకు సానపెట్టండిలా..
యూత్ కార్నర్
- Prachi Nigam: స్టేట్ ఫస్ట్.. అయినా బాడీ షేమింగ్ తప్పలేదు!
- ప్రాణం కోసం... ‘సూర్య నాయక్’
- Janhvi Kapoor : నచ్చిందే పదే పదే తింటుంటా!
- ఆ సమయంలో... అయిదేళ్ల పిల్లనైపోతా!
- కేరళ కుట్టికి... ‘టీన్’ కిరీటం!
'స్వీట్' హోం
- తేలిగ్గా వండేద్దాం..!
- చెత్తబుట్ట నుంచి దుర్వాసన రాకుండా..!
- ప్రకృతికి కోపం తెప్పిస్తున్నారా?
- ఎయిర్ ప్యూరిఫయర్‌కు బదులు ఇవి!
- వంటింట్లో కీటకాల బెడదా..
వర్క్ & లైఫ్
- భరణం ఇవ్వాల్సొస్తుందని ఉద్యోగం మానేశాడు!
- నేను బాగా పనిచేయడం లేదు!
- గెలవాలంటే నేర్చుకోవాలి..
- మళ్లీ పెళ్లి వద్దంటోంది..!
- ప్రతిసారీ మర్చిపోతున్నారా?