ఆఫీసుకు వెళ్లాలంటే భయం

ఇటీవలే నా కలల సంస్థలో ఉద్యోగం వచ్చింది. శిక్షణలో ఉన్నా. ఇలాంటి సంస్థలో పనిచేయాలనేది నా కోరిక. కానీ ఇప్పుడు ఆఫీసుకు వెళ్లాలంటేనే భయమేస్తోంది. ఏదైనా తప్పు చేసి, నవ్వుల పాలవుతానేమోనని ఒకటే కంగారు. కాలేజీలో సరిగా నేర్పించలేదు,

Updated : 25 Sep 2021 04:51 IST

ఇటీవలే నా కలల సంస్థలో ఉద్యోగం వచ్చింది. శిక్షణలో ఉన్నా. ఇలాంటి సంస్థలో పనిచేయాలనేది నా కోరిక. కానీ ఇప్పుడు ఆఫీసుకు వెళ్లాలంటేనే భయమేస్తోంది. ఏదైనా తప్పు చేసి, నవ్వుల పాలవుతానేమోనని ఒకటే కంగారు. కాలేజీలో సరిగా నేర్పించలేదు, ఉద్యోగ బాధ్యతల్లో విఫలమవుతాననిపిస్తోంది. ఇలాంటి పరిస్థితిలో ఏం చేయాలో సలహా ఇవ్వండి.

- ఓ సోదరి, బెంగళూరు

యమనేది సహజమైన, శారీరక ప్రతిస్పందన. దీన్ని పూర్తిగా నిరోధించడం కష్టం. అయినా భరోసా ఇవ్వడానికి ఈ సూచనలు కొంత వరకూ సాయపడతాయి. ఏ సంస్థా మీరు చేరగానే పని చేయాలనీ, అన్నీ నేర్చేసుకోవాలని ఆశించదు. పైగా.. మొదటి 90 రోజుల్లోనే అన్నీ తెలుసు కోవాలనుకోవడం కొత్తగా చేరిన వాళ్లు చేసే తప్పుగా మేనేజర్లే చెబుతుంటారు. ఇలాంటి ఆందోళన మాని, వీలైనన్ని ప్రశ్నలతో వెళ్లండి. ఫీడ్‌బ్యాక్‌ తీసుకోవడానికి సుముఖంగా, కొత్తవి నేర్చుకోవడానికి సంసిద్ధత, సానుకూల వైఖరి, చెప్పింది పూర్తిగా వినడం, ఆలోచనాత్మక ప్రశ్నలడగడం వంటివి మీపై పాజిటివ్‌ అభిప్రాయాన్ని కలిగిస్తాయి. ఆఫీసులో వాళ్లందరినీ కలుస్తూ ఉండండి. ఇది ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. దీనికీ భయపడకుండా సహజంగా కలిసే ప్రయత్నం చేయండి. దీన్నే నెట్‌వర్కింగ్‌ అంటాం. ఇది పని సంస్కృతిని తెలియచెబుతుంది. కొత్త అవకాశాల గురించీ తెలియజేస్తుంది. దీంతో మరింత ఆహ్లాదంగా పని చేయగలుగుతారు. ముందుగా ఎవరిని పరిచయం చేసుకోవాలో మీపై అధికారులు, సహచరులను అడగండి. వీలైతే వారినే పరిచయం చేయమని కోరండి. తర్వాత ఆ స్నేహపూరిత వాతావరణాన్ని కొనసాగిస్తే సరి. ఆందోళన కలిగించే పనిని ముందు చేసేయండి. ఉదాహరణకు... కాలేజీలో సరిగా నేర్పించలేదు అనిపిస్తోంది కదా! వేరే మార్గంలో నేర్చుకునే ప్రయత్నం చేయండి. కాలం, ఆత్మవిశ్వాసం భయాన్ని తగ్గించే గొప్ప మందులు. కాబట్టి, పని మీద దృష్టిపెట్టండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్