నాన్న ఆస్తి అమ్మకు వస్తుందా?
మా అమ్మ మేనత్తకి పిల్లలు లేకపోవడంతో నాన్నని దత్తత తీసుకుని అమ్మనిచ్చి పెళ్లిచేసింది. తన ఇల్లు, పొలం అతడి పేరున రాసింది. తర్వాత వీళ్లిద్దరి మధ్య పొరపొచ్చాలు రావడంతో....
మా అమ్మ మేనత్తకి పిల్లలు లేకపోవడంతో నాన్నని దత్తత తీసుకుని అమ్మనిచ్చి పెళ్లిచేసింది. తన ఇల్లు, పొలం అతడి పేరున రాసింది. తర్వాత వీళ్లిద్దరి మధ్య పొరపొచ్చాలు రావడంతో విడాకులు తీసుకోకుండానే దూరమయ్యారు. ఆ పొలం, ఇంటిని అమ్మకే వదిలేసి మరో పెళ్లి చేసుకున్నారు. కాగితాలు రాసుకున్నారు. కానీ రిజిస్ట్రేషన్ చేయించలేదు. ఇప్పుడు వాటిని మా అమ్మ పేరు మీదకి రిజిస్ట్రేషన్ చేయించొచ్చా..?
- ఓ సోదరి
అమ్మానాన్నలు విడిపోయేటప్పుడు కాగితాల్లో ఏం రాసుకున్నారు. వాటిని రిజిస్ట్రేషన్ చేయించారా వంటివి తెలియాలి. భర్త పేరిట ఉన్న ఆస్తికి భార్య అతడి మరణానంతరమే వారసురాలవుతుంది. లేదా ఆయన గిఫ్ట్/సేల్ డీడ్ రాసి రిజిస్ట్రేషన్ చేయించినా ఆవిడకి హక్కు ఉంటుంది. మీ అమ్మ పేరిట మ్యుటేషన్ చేయించుకోవాలంటే రెవెన్యూ రికార్డుల్లో పేరు మారాలి. అయితే ఇదంత సులువు కాదు. రిజిస్టర్డ్ డీడ్ లేకుండా అలా పేరు మార్చుకునే వీల్లేదు. మీరు ముందు మీ నాన్నతో ఆస్తి మీ అమ్మ పేరు మీద బదలాయించడానికి తగిన పత్రాలు రాయించి రిజిస్ట్రేషన్ చేయించండి. అప్పుడు రెవెన్యూ అధికారులకు చెప్పి పేరు మార్పించండి. ఆయన మరణానంతరం అయితే మొదటి, రెండో భార్య పిల్లలందరూ ఆస్తికి వారసులే. మీ అమ్మగారి మేనత్త కూడా ఇద్దరి పేరునా ఆస్తి రాసి ఉంటే బావుండేది. ఇక, మీ నాన్నకి అది దత్తత ద్వారా వచ్చిన ఆస్తి కాబట్టి ఆయన స్వార్జితం కిందే లెక్క. మీకు ఆ ఆస్తి రావాలంటే మీ నాన్నే ఇవ్వాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.