పెళ్లయిన వాడితో సంబంధం పెట్టుకుంది...

మా అక్క ఐటీ ఉద్యోగి. పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. కానీ బాధాకరమైన సంగతేమంటే పెళ్లయి, పిల్లలున్న వ్యక్తితో సంబంధం పెట్టుకుంది. నగ్నంగా వీడియో కాల్స్‌ మాట్లాడుతున్నారు.

Updated : 29 Sep 2021 05:10 IST

మా అక్క ఐటీ ఉద్యోగి. పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. కానీ బాధాకరమైన సంగతేమంటే పెళ్లయి, పిల్లలున్న వ్యక్తితో సంబంధం పెట్టుకుంది. నగ్నంగా వీడియో కాల్స్‌ మాట్లాడుతున్నారు. ఈ సంగతి అమ్మా నాన్నలతో చెబితే పర్యవసానాలు ఎలా ఉంటాయోనని భయం వేస్తోంది. ఆమెలో మార్పు రావాలంటే నేనేం చేయాలో చెప్పండి ప్లీజ్‌!  - ఒక సోదరి

ఇందులో మూడు సంగతులున్నాయి. మీ అక్క చిన్నపిల్ల కాదు, చదువుకుని, ఉద్యోగం చేస్తోంది. ప్రేమ, పెళ్లి, అనైతిక సంబంధాలు, రాబోయే పరిణామాలఅవగాహన చేసుకో గలదు. ప్రేమ, పెళ్లి, సహజీవనం లాంటివన్నీ వ్యక్తిగతం. కనుక ఆమె ఎదురు తిరిగే అవకాశముంది. తను మేజర్‌. అతనితో తిరగొద్దని బెదిరించలేరు. ఇక మూడోది కుటుంబ సమస్య. ఇది చాలా సున్నితమైంది. సమాజంలో పెళ్లికి సంబంధించిన విషయాలు వ్యవస్థ మీద, కుటుంబసభ్యుల ఉనికి, మానసిక స్థితుల మీద కూడా ప్రభావం చూపిస్తాయి. ఆ విషయాలనే అక్కతో అనునయంగా చెప్పండి. తను చేస్తోన్న పని వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో ఉదాహరణలో వివరించండి. అయినా మాట వినకపోతే చూచాయగా అమ్మానాన్నలకు తెలియజేయండి. అప్పుడు తెలిసీ దాచిపెట్టాననే దిగులు మీకుండదు. మీ బాధ్యత పూర్తవుతుంది. ఇక ఆమెను ఎలా సమర్థించాలో, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో పెద్దలుగా అమ్మానాన్నలు చూసుకుంటారు. అబద్ధాలు, మోసాలతో ఏ బంధమూ నిలవదు. అసలు ఇలాంటి రిలేషన్‌ పెట్టుకున్నామె పెళ్లికి ఒప్పుకోకపోవచ్చు. ఒకవేళ చేసుకోదలిస్తే సైకియాట్రిస్టు దగ్గరికి వెళ్తే కౌన్సెలింగ్‌ ఇస్తారు. భవిషత్తులో ఫొటోలు, వీడియోలతో ఆమెను బెదిరించే అవకాశం లేకుండా ముందే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరమైతే పెద్దమనుషుల సాయం కోరండి. పిల్లలున్న వాడు కనుక నలుగురికీ తెలుస్తుందని అతనూ భయపడతాడు. కాదంటే పోలీసులకు ఫిర్యాదు చేయండి. ఇది సున్నితంగా పరిష్కరించుకోవాల్సిన సమస్య.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని