ట్యూబెక్టమీని సిజేరియన్‌తోపాటు చేయించుకోవచ్చా?
నాకిప్పుడు ఏడో నెల. అయిదేళ్ల కిందట సిజేరియన్ ద్వారా బాబు పుట్టాడు. ఈ రెండో సంతానం తర్వాత పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకోవాలనుకుంటున్నా. కాన్పు సమయంలోనే చేయించుకుంటే మంచిదా? లేదంటే కొన్నాళ్లు ఆగాలా?
నాకిప్పుడు ఏడో నెల. అయిదేళ్ల కిందట సిజేరియన్ ద్వారా బాబు పుట్టాడు. ఈ రెండో సంతానం తర్వాత పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకోవాలనుకుంటున్నా. కాన్పు సమయంలోనే చేయించుకుంటే మంచిదా? లేదంటే కొన్నాళ్లు ఆగాలా?
- ఓ సోదరి, హైదరాబాద్
మీకు రెండోసారీ సిజేరియనే అవుతుంది. అదే సమయంలో ట్యూబెక్టమీ చేయించుకోవచ్చా అని అడుగుతున్నారు. ఇది మీ దంపతులిద్దరూ కలిసి నిర్ణయించుకోవాలి. అయితే ఒకే సమయంలో చేయించుకోవడంవల్ల అనస్తీషియా తీసుకోవడం, కాన్పు తర్వాత విశ్రాంతి, ఆస్పత్రి ఖర్చులు ఇవన్నీ కలిసి వస్తాయి. సిజేరియన్‌తోపాటు ట్యూబెక్టమీ చేసినప్పుడు అది ఫెయిలయ్యే అవకాశాలూ ఉన్నాయి. రెండోది... బిడ్డ ఆరోగ్యం గురించీ ఆలోచించాలి. అందులో మొదటి సంవత్సరం కీలకం. ఎందుకంటే నవజాత శిశువుల మరణాల సంఖ్య మనదేశంలో ఇంకా ఎక్కువగానే ఉంది. అందుకని వైద్యులుగా మేం ఇచ్చే సలహా కాన్పు తర్వాత సంవత్సరం ఆగి, టీకాలన్నీ పూర్తయి, బిడ్డకు ఎలాంటి లోపాలు లేవని, ఆరోగ్యం అంతా బాగుందని నిర్ధారించుకుని, అప్పుడు ట్యూబెక్టమీ చేయించుకుంటే మంచిది.
ముఖ్యంగా మీరు ఆలోచిస్తోంది మళ్లీ ఆస్పత్రిలో అడ్మిట్ అవడం, శస్త్రచికిత్స గురించే అని అర్థమవుతోంది. ట్యూబెక్టమీ తర్వాత ఓ పూట ఆస్పత్రిలో ఉంటే సరిపోతుంది. కుట్లు కూడా లేకుండా నాభిలో నుంచి చిన్న రంధ్రం చేసి అక్కడి నుంచి చేసేస్తారు. కాబట్టి మీ దంపతులిద్దరూ కలిసి ఓ నిర్ణయం తీసుకోండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.