కొలాజెన్‌ క్యారెట్‌

వయసు పెరిగేకొద్దీ ముఖంపై ముడతలు, గీతలు సాధారణమే. దీనికి క్యారెట్‌ మంచి పరిష్కారమంటున్నారు నిపుణులు..

Updated : 14 Oct 2021 05:52 IST

వయసు పెరిగేకొద్దీ ముఖంపై ముడతలు, గీతలు సాధారణమే. దీనికి క్యారెట్‌ మంచి పరిష్కారమంటున్నారు నిపుణులు..

క్యారెట్‌లో ఎ, కె, బి6 విటమిన్లు, బయోటిన్‌, మినరల్స్‌, బీటా కెరొటిన్‌ గుణాలెక్కువ. దీన్ని రోజూ ఆహారంలో భాగం చేసుకుంటే మధుమేహ ప్రమాదమండదు. పీచు యాసిడ్లను అదుపులో ఉంచడమే కాదు.. అజీర్తినీ నిరోధిస్తుంది.

* దీనిలో ఉండే కెరొటినాయిడ్స్‌, బయోయాక్టివ్‌ ఫ్లెవనాయిడ్లు కణాల ఆరోగ్యానికి చాలామంచిది. నేరుగా తీసుకున్నా, ఉడికించి తీసుకున్నా చర్మానికి మంచిదే. విటమిన్‌ ఎ.... కణాలు, కొలాజెన్‌ ఉత్పత్తికీ సాయపడుతుంది. కళ్ల ఆరోగ్యానికీ మేలు చేస్తుంది. విటమిన్‌ సి ఇమ్యూనిటీని పెంచుతుంది.

క్యారెట్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం గుండె, మెదడు, మూత్రపిండాల ఆరోగ్యానికి చాలా మంచివి. రక్తపోటును అదుపులో ఉంచుతాయి. ఒత్తిడిని దూరంగా ఉంచడమే కాకుండా టాక్సిన్లను బయటికి పంపి కాలేయాన్నీ ఆరోగ్యంగా ఉంచుతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్