నాకిక పిల్లలు పుట్టరేమో...
పెళ్లై ఏడేళ్లయినా పిల్లలు లేరు. డాక్టర్లు ఏ లోపమూ లేదన్నారు. మా మరిదికి పెళ్లైన ఏడాదికే కొడుకు పుట్టాడు. నాకు బాబును ఎత్తుకుని ఆడించాలని ఉంటుంది. కానీ తోడికోడలిని అడగాలంటే ఇబ్బంది.
పెళ్లై ఏడేళ్లయినా పిల్లలు లేరు. డాక్టర్లు ఏ లోపమూ లేదన్నారు. మా మరిదికి పెళ్లైన ఏడాదికే కొడుకు పుట్టాడు. నాకు బాబును ఎత్తుకుని ఆడించాలని ఉంటుంది. కానీ తోడికోడలిని అడగాలంటే ఇబ్బంది. వాళ్లను చూస్తుంటే కాస్త అసూయగానూ ఉంది. ఇలా ఆలోచించడం తప్పేనని తెలుసు. ఈ బాధ నుంచి బయటపడే మార్గం చెప్పండి.
- ఓ సోదరి, మైసూరు
పిల్లలు పుట్టడమన్నది మన బంధువులు, చుట్టు పక్కల వాళ్లలాగే జరగకపోవచ్చు. అది భార్యా భర్తల శరీర తత్త్వం, పరిపక్వత, సెక్సువల్ ఆర్గాన్స్ డెవలప్మెంట్, సంతానోత్పత్తి సామర్థ్యం (మెచ్యూరిటీ ఆఫ్ రీప్రొడక్టివ్ సిస్టమ్) మీద ఆధారపడి ఉంటుంది. డాక్టర్లు పరీక్షించి అంతా బాగానే ఉంది అన్నారంటే ఇప్పుడు కాకున్నా కొంతకాలంలో సంతానం కలిగే అవకాశం ఉంది. కొందరికి ముందు, ఇంకొందరికి తర్వాత పుట్టడం సాధారణం. దాని గురించి మీరు అవమానం చెందాల్సిన, బాధపడాల్సిన అవసరం లేదు. సంతానోత్పత్తికి ఏ సమయం అనుకూలమో డాక్టర్లు చెప్పేవుంటారు. ఆ సలహా పాటించండి. మానసికంగా ఏ దిగుళ్లూ లేకుండా ఉల్లాసంగా, సంతోషంగా ఉన్నప్పుడు హార్మోన్లు నియంత్రణలో ఉంటాయి. ఆందోళన చెందుతుంటే వాటి గతి తప్పుతుంది. మీరు ఆనందంగా ఉంటే పిల్లలు పుట్టడానికి అనుకూలమైన హార్మోన్లు సవ్యంగా ఉండి సమస్య ఉత్పన్నం కాదు. ఏది ఎలా జరిగినా దాన్ని అంగీకరించే తత్వాన్ని అలవాటు చేసుకోండి. ఆశావహంగా ఆలోచిస్తే నిశ్చింతగా ఉంటుంది. నిరుత్సాహపడకండి... అంతా మంచే జరుగుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- జోరుమీదున్నాయి... జిప్ నగలు!
- చెమట ఎక్కువగా పడుతోందా?
- స్పోర్ట్స్ బ్రా.. ఎలా ఎంచుకోవాలి?
- స్ట్రెచ్ మార్క్స్‌కి బేకింగ్ సోడా..
- చీరపై... రామ చిత్రాలెన్నో!
ఆరోగ్యమస్తు
- 5-9... 9-5 ఈ ట్రెండేంటో తెలుసా!
- బరువు తగ్గించే ‘బీరకాయ సూప్’!
- చక్కెర పానీయాలు వద్దు... పండ్ల రసాలే ముద్దు!
- ఆరోగ్యాన్నిచ్చే.. నవమి నైవేద్యం!
- ఆరోగ్యానికి... శ్రీరామరక్ష!
అనుబంధం
- అపరాధ భావం లేకుండా...
- ‘ఇంటి నుంచి వెళ్లిపో’ అంటున్నాడు..!
- గర్భస్రావం అయ్యాక..!
- సీత... ఎప్పటికీ వాళ్ల పెద్ద కూతురే!
- విడాకుల విషయం పిల్లలకెలా చెప్పాలి?
యూత్ కార్నర్
- తల్లి పారిశుద్ధ్య కార్మికురాలు... కూతురు అగ్నివీర్!
- UPSC Results : సంకల్ప బలంతో సాధించారు!
- గెలుపు కథ రాసుకున్నారు!
- అమ్మాయిలు...అదరగొట్టేశారు!
- ఈ కవలలు... స్ఫూర్తి శిఖరాలు!
'స్వీట్' హోం
- వంటిల్లు పొందిగ్గా
- మామిడి పండు ఇడ్లీలు!
- ఎంబ్రాయిడరీతో రామకథ!
- వార్డ్రోబ్.. సువాసనభరితంగా!
- శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా!
వర్క్ & లైఫ్
- నెలసరి కాలుష్యం లేకుండా!
- ప్రయాణాల కోసం ‘సోప్ పేపర్’!
- నిండైన నీల లత అందం!
- ఇంటికో సీతమ్మ తల్లి!
- ముందున్నాం..!