చెప్పకుండా వెళ్లిపోయానని నోటీసులిచ్చాడు!
నాకు నాలుగేళ్ల క్రితం పెళ్లయ్యింది. మా వారి చెల్లెలు భర్తతో గొడవల కారణంగా... మూడేళ్ల పాపతో పుట్టింట్లోనే ఉంటోంది. పెళ్లికి ముందు అడిగితే... సమస్యలున్నాయి. తగ్గాక వెళ్లిపోతుంది అన్నారు. కానీ అది జరగలేదు. పైగా తర్వాత వారి బాధ్యత తనదే అన్నాడు.
నాకు నాలుగేళ్ల క్రితం పెళ్లయ్యింది. మా వారి చెల్లెలు భర్తతో గొడవల కారణంగా... మూడేళ్ల పాపతో పుట్టింట్లోనే ఉంటోంది. పెళ్లికి ముందు అడిగితే... సమస్యలున్నాయి. తగ్గాక వెళ్లిపోతుంది అన్నారు. కానీ అది జరగలేదు. పైగా తర్వాత వారి బాధ్యత తనదే అన్నాడు. నాతో సరిగా ఉండడు. ఆరోగ్యం బాగోక వాళ్లను అడిగే పుట్టింటికి వచ్చా. మూడు నెలలు ఒక్క ఫోనూ చేయలేదు. అకస్మాత్తుగా నా భార్య చెప్పాపెట్టకుండా ఇంట్లోంచి వెళ్లిపోయింది అని కోర్టు నోటీసు పంపాడు. మా పెద్దలు వెళ్లి మాదే తప్పు, అమ్మాయిని పంపిస్తామని చెప్పి వచ్చారు. ఈలోగానే విడాకులకు దరఖాస్తు చేశాడు. మేము మెయింటెనెన్స్ వేశాం. ఇంత జరిగాక అతను నాతో ఎలా ఉంటాడో తెలియదు. నా సమస్యని ఎలా పరిష్కరించుకోవాలి?
- ఓ సోదరి, గుంటూరు
భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి ఉన్నప్పుడు సమస్యలు రావడం సహజం. మీ ఆడపడుచు ఇంట్లో ఉండటం, వాళ్లను చూసుకుంటానని మీ భర్త చెప్పడం తప్పు కాదు. ఆ విషయాలు ముందుగా మీతో చెబితే సరిపోయేది. ఇక, మీరా విషయాన్ని పెద్దది చేసి చూడకుండా ఉండాల్సింది. ఇంటి బాధ్యతలు నిర్వర్తిస్తోన్న మిమ్మల్ని గుర్తించకపోవడం, అభినందించకపోవడం వంటివి మిమ్మల్ని బాధించి ఉండొచ్చు. కూర్చుని మాట్లాడుకోవాల్సింది. కానీ చిన్న విషయాలకు విడాకుల దాకా వెళ్లడం తొందరపాటే. ఈ కేసులో మధ్యవర్తి దగ్గరకి కౌన్సెలింగ్‌కి వెళ్లారో లేదో తెలియలేదు. అక్కడ మీకు డైవోర్స్ ఇష్టం లేకపోతే ఆ విషయం చెప్పొచ్చు. మీడియేటింగ్ కోసం మహిళా పోలీస్‌స్టేషన్‌ల్లోనూ ప్రత్యేక విభాగాలు ఉన్నాయి. అయితే ఇలా స్టేషన్‌కి పిలిపిస్తే మగవారు... అఫెండ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కోర్టులోనే మీ సమస్యని తేల్చుకోండి. ఒకవేళ అతడితో తిరిగి జీవితం పంచుకోవాలనుకుంటే... హిందూ వివాహచట్టంలోని సెక్షన్ 9 ప్రకారం కంజుగల్ రైట్స్ కోసం దరఖాస్తు చేయొచ్చు. ముందు ఆ పనిచేయండి. ఇక మీ కట్నకానుకలు, వస్తువులు తీసుకోవాలనుకుంటే.... గృహహింస చట్టం, విడాకుల కేసు, మెయింటెనెన్స్‌ల వంటివి వేసి తిరిగి తీసుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.