నలభైల్లోనూ హుషారుగా...

ఇల్లాలికి నలభై వచ్చేసరికి ఇంటా బయటా చాలా మార్పులు వస్తాయి. వయో భారం వల్ల అత్తగారి సహకారం తగ్గి ఇంటి పని పెరుగుతుంది. పిల్లల పేచీలు ఎక్కువై అదొక ఒత్తిడి. ఆఫీసులోనూ సీనియార్టీ వల్ల పని పెరుగుతుంది. వీటన్నింటి వల్లా అలసట...

Updated : 29 Oct 2021 06:10 IST

ఇల్లాలికి నలభై వచ్చేసరికి ఇంటా బయటా చాలా మార్పులు వస్తాయి. వయో భారం వల్ల అత్తగారి సహకారం తగ్గి ఇంటి పని పెరుగుతుంది. పిల్లల పేచీలు ఎక్కువై అదొక ఒత్తిడి. ఆఫీసులోనూ సీనియార్టీ వల్ల పని పెరుగుతుంది. వీటన్నింటి వల్లా అలసట... ఫలితంగా చలాకీతనం తగ్గుతుంది. కొన్నిసార్లు డిప్రెషన్‌ బారినా పడొచ్చు. వీటిని సమర్థంగా ఎదుర్కోవాలంటే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలంటున్నారు ఆరోగ్యనిపుణులు.

* డ్రై ఫ్రూట్స్‌: బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్‌, కర్బూజా, గుమ్మడి తదితర గింజల్లో పోషకాలు, పీచు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ ఉంటాయి. వీటిని మార్చి మార్చి తినాలి. రోజుకు నాలుగైదు గింజల్ని నానబెట్టి తింటే సరిపోతుంది.

* తాజా పండ్లు: వీటిల్లో విటమిన్లు, మినరల్స్‌, పోషకాలు విస్తారం. స్వీట్లు, జంక్‌ఫుడ్‌కు బదులు సీజన్లలో దొరికే పండ్లు తినడం వల్ల డిప్రెషన్‌ వచ్చే అవకాశాలు తక్కువ.

* నెయ్యి: ఆరోగ్యకర కొలెస్ట్రాల్‌ ఉంటుంది. తక్కువ పరిమాణంలో దీన్ని తప్పక తినమంటున్నారు వైద్యులు.

* క్యారెట్‌: విటమిన్లు, మినరల్స్‌, పీచు పుష్కలంగా ఉండి యాంటీ డిప్రెసెంట్‌గా పనిచేస్తాయి. ముఖ్యంగా కళ్ల సమస్యలను అరికడతాయి.

* ఆకుకూరలు: తోటకూర, బచ్చలి, గోంగూర, కొత్తిమీర లాంటి వాటి వల్ల పోషకాలు అందుతాయి. ఊబకాయం, రక్తపోటు, హృద్రోగాల నుంచి కాపాడతాయి. మానసిక ఒత్తిళ్లను తగ్గిస్తాయి. ఇవన్నీ తీసుకోవడంతో పాటు... సరైన వేళల్లో ఆహారాన్ని తీసుకుంటుండాలి. జంక్‌ఫుడ్‌కీ దూరంగా ఉండాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్