నాకు పెళ్లవుతుందా...

పదో తరగతి వరకూ చదివా. సేల్స్‌గర్ల్‌గా చేస్తున్నాను. చెల్లెళ్లిద్దరూ చదుతున్నారు. నాకు 28. నా స్నేహితులందరికీ పెళ్లిళ్లు అయిపోయాయి. నాన్న సంపాదన తాగుడికే సరి. పైగా నా డబ్బులూ దుబారా

Updated : 14 Nov 2021 04:38 IST

పదో తరగతి వరకూ చదివా. సేల్స్‌గర్ల్‌గా చేస్తున్నాను. చెల్లెళ్లిద్దరూ చదుతున్నారు. నాకు 28. నా స్నేహితులందరికీ పెళ్లిళ్లు అయిపోయాయి. నాన్న సంపాదన తాగుడికే సరి. పైగా నా డబ్బులూ దుబారా చేస్తాడు. మా పరిస్థితులు చూసి నాకు సంబంధాలే రావడం లేదు. స్నేహితుల ఇళ్లకు వెళితే నా పెళ్లి గురించే అడుగుతున్నారు. ఇలాగే ఒంటరిగా మిగిలి పోతానేమోనని భయంగా ఉంది.

- ఓ సోదరి, హైదరాబాద్‌

సాధారణంగా 25 దాటిన తర్వాత అందరూ పెళ్లి గురించి ఆలోచిస్తారు. మీ బంధుమిత్రుల్లో అలాగే జరిగుంటుంది. అందుకే మిమ్మల్ని బాధపెట్టాలని లేకున్నా ఇంకా కాలేదేమని అడుగుతారు. దానికి బాధపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ బంధువర్గంలో బాధ్యత తీసుకునే వాళ్లు, చేదోడుగా, సానుకూలంగా స్పందించే వాళ్లు ఉంటే మీ సమస్యను చర్చించండి. మీ పరిస్థితి తెలిసి మిమ్మల్ని అర్థం చేసుకున్న వాళ్లయితే తగిన సంబంధం చూపగలుగుతారు. ఇక మీ నాన్న విషయంలో కొంచెం గట్టిగానే ఉండటం మంచిది. మీ సంపాదనను బ్యాంకులో వేసి అందుబాటులో లేకుండా చేయండి. పెద్దవాళ్లయినా బాధ్యతారహితంగా ఉన్నప్పుడు నియంత్రించాలి. మీ సన్నిహిత బంధువులకు కూడా ఆయన గురించి చెప్పి ఆయన ప్రవర్తనలో మార్పు వచ్చేలా చేయండి. అవసరమైతే సైకియాట్రిస్టు దగ్గరికి తీసికెళ్లి తాగుడు మాన్పించండి. మీ స్నేహితుల్లో ఎవరైనా సానుభూతితో కాకుండా సదభిప్రాయంతో మిమ్మల్ని ఇష్టపడే వారు ఉంటే కుటుంబ సభ్యులతో చెప్పి తగిన వ్యక్తి అనుకుంటే చేసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని