కట్నం ఇవ్వలేదు.. ఆస్తిలో వాటా అడగొచ్చా?
మా తాతయ్య మా అమ్మమ్మకి తెలియకుండా మరో ఆమెతోనూ కాపురం చేశారు. కానీ పెళ్లి చేసుకోలేదు. అమ్మమ్మకి ముగ్గురు అమ్మాయిలు. ఆవిడకు ఇద్దరబ్బాయిలు. ఈ మధ్య తాతయ్య అనారోగ్యంతో మరణించారు. అప్పటి నుంచి ఆస్తి తగాదాలొచ్చాయి. ఆయన పేరున కొంత ఆస్తి ఉంది. మిగిలినది రెండో భార్య కొడుకుల పేరు మీద పహాణీ ఉంది. కానీ రిజిస్ట్రేషన్ కాలేదు. మా తాతయ్య కూతుళ్లకు పెళ్లి చేసి పంపాడే తప్ప.......
మా తాతయ్య మా అమ్మమ్మకి తెలియకుండా మరో ఆమెతోనూ కాపురం చేశారు. కానీ పెళ్లి చేసుకోలేదు. అమ్మమ్మకి ముగ్గురు అమ్మాయిలు. ఆవిడకు ఇద్దరబ్బాయిలు. ఈ మధ్య తాతయ్య అనారోగ్యంతో మరణించారు. అప్పటి నుంచి ఆస్తి తగాదాలొచ్చాయి. ఆయన పేరున కొంత ఆస్తి ఉంది. మిగిలినది రెండో భార్య కొడుకుల పేరు మీద పహాణీ ఉంది. కానీ రిజిస్ట్రేషన్ కాలేదు. మా తాతయ్య కూతుళ్లకు పెళ్లి చేసి పంపాడే తప్ప... కట్నకానుకలేవీ ఇవ్వలేదు. ఇప్పుడు ఆ ఆస్తిలో అమ్మపేరున వాటా అడగొచ్చా? మాకు న్యాయం జరగాలంటే ఏం చేయాలి?
- ఓ సోదరి, హైదరాబాద్
మీ తాతయ్య ఆస్తికి ఆయన పిల్లలందరూ వారసులే. ఎటొచ్చీ ఆయన రెండవ భార్య కొడుకుల పేరు మీద పహాణీలు ఎలా వచ్చాయో తెలియాలి. సాధారణంగా రెవిన్యూ రికార్డ్స్‌లో భూయజమాని లేదా పొలం పండిస్తున్న వారి పేరు ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేయకుండా పహాణీలో పేరు కనిపిస్తోందంటే పండిస్తున్న వారి కాలమ్‌లో ఉండి ఉండాలి. హిందూ వారసత్వ చట్టం-1956 ప్రకారం మీ తాతగారి మొత్తం ఆస్తులను... ఆయనకు మిగిలిన ఉన్న వారసులందరికీ పంచాల్సి ఉంటుంది. ముందుగా క్లాస్-1 వారసులుగా భార్య, పిల్లల్ని పరిగణిస్తారు. బిడ్డలు మరణిస్తే... వారి సంతతిని భాగస్వాములుగా గుర్తిస్తారు. ఈ విభాగంలో వితంతువులు ఉంటే వారికీ వాటా ఉంటుంది. ఇక, మీ తాత ఆవిడను పెళ్లి చేసుకోలేదు కాబట్టి వారి పిల్లలు మాత్రమే ఆస్తికి వారసులవుతారు. హిందూ వారసత్వ చట్టం సెక్షన్- 10, రూల్ 2 ప్రకారం... తల్లి, బతికి ఉన్న పిల్లలందరూ ఒక్కో భాగం తీసుకోవడానికి ఆర్హులే కాబట్టి మీరు మీ తాత ఆస్తిలో మీ అమ్మ వాటా కోరుతూ దావా వేయండి. ఎవరెవరు భాగస్వామ్యం కోరుతున్నారో వారందరినీ వాదులుగా చేర్చండి. భాగస్వామ్యానికి అర్హులందరినీ ప్రతివాదులుగా చేర్చండి. అలానే ఆస్తి ఎవరి స్వాధీనంలో ఉందో వారు ఆస్తిని తమ పేరు మీద కానీ, వేరే వారి పేరుమీదకు కానీ మార్చకుండా ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకోండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.