నన్నో మనిషిలా చూడరు

దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన నన్ను మావారు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. కానీ కట్నకానుకలు తేలేదని అత్తగారికి నచ్చను. రోజంతా ఇంటి పనులు చేసినా విసుక్కుంటారు. పెళ్లీడుకొచ్చిన ఆడపడుచుతో చిన్న పని కూడా చేయించరు.

Updated : 20 Oct 2022 11:55 IST

దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన నన్ను మావారు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. కానీ కట్నకానుకలు తేలేదని అత్తగారికి నచ్చను. రోజంతా ఇంటి పనులు చేసినా విసుక్కుంటారు. పెళ్లీడుకొచ్చిన ఆడపడుచుతో చిన్న పని కూడా చేయించరు. ఆయన లేనప్పుడు నన్నో మనిషిలా కూడా చూడరు. ఇవన్నీ ఆయనతో చెప్పలేక నలిగిపోతున్నాను. ఏం చేయాలో తెలియడం లేదు.

- విమల, హైదరాబాద్‌

న సంప్రదాయం ప్రకారం అత్తగారింటికి వెళ్లాక ఇంటిపనులు, బాధ్యతలు మామూలే. అత్తగారు, కోడళ్ల మధ్య సఖ్యత ఉంటే ఇంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కానీ మీ విషయంలో ఆవిడ సమ్మతం లేకుండా పెళ్లయినందున కొంత చిన్నచూపు ఉండొచ్చు. కొడుకును ఏమీ అనలేక మీపట్ల పరోక్షంగా అయిష్టత చూపుతుండొచ్చు. ఆడపడుచు ఎటూ పెళ్లిచేసుకుని వెళ్లిపోతుంది. ఆమె పనిచేయడంలేదని ఫిర్యాదుచేస్తే అదింకా వ్యతిరేకతనే తెచ్చిపెడుతుంది. మీ భర్త ముందు ఆవిడ మంచిగానే ఉంటుంది కనుక మీరేమైనా చెప్పినా తల్లిమీద చాడీలు చెబుతున్నారని నమ్మకపోవచ్చు. సాంత్వన దొరక్కపోగా అతనికి మీ మీద ఉన్న ప్రేమ కూడా తగ్గొచ్చు. అందువల్ల పరిస్థితులను బట్టి సర్దుకుపోతూ ఆశాజనకంగా ఉండండి. ముందు ఏదైనా ఉద్యోగం చూసుకోండి. చదువును సద్వినియోగం చేసుకున్నట్టూ ఉంటుంది, కొంత ఆదాయమూ వస్తుందని నచ్చజెప్పండి. అలా పగలు మీరు లేనప్పుడు కొన్ని పనులు ఆవిడ చేసుకుంటారు. మీకు శారీరకంగా, మానసికంగా ఊరట లభిస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని