బరువు తగ్గితే మంచిది కాదా!

మందులు, ఆహారానికి మధ్య సమతుల్యత లోపించడం, వ్యాయామం చేయకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు పెరుగుతాయి. ఈ వయసులో బరువు నియంత్రణ మంచిదే. కానీ, కారణం లేకుండా రక్తంలో చక్కెర స్థాయులు పెరిగి, వెయిట్‌, మజిల్‌ మాస్‌ తగ్గడం మంచిది కాదు.  కాబట్టి.

Updated : 04 Dec 2021 01:04 IST

నా వయసు 58. ఎత్తు 5.4. బరువు 60 కిలోలు. కొన్నేళ్లుగా మధు మేహం ఉంది. ఈ మధ్య 2 కిలోలు తగ్గా. ఆస్పత్రికి వెళితే బరువు, మజిల్‌ మాస్‌ తగ్గి, చక్కెర స్థాయులు పెరిగాయన్నారు. వెయిట్‌ తగ్గడం మంచిదంటారు కదా. మరి ఇదేంటి? ఇప్పుడు నేనేం చేయాలి?  

- ఓ సోదరి

మందులు, ఆహారానికి మధ్య సమతుల్యత లోపించడం, వ్యాయామం చేయకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు పెరుగుతాయి. ఈ వయసులో బరువు నియంత్రణ మంచిదే. కానీ, కారణం లేకుండా రక్తంలో చక్కెర స్థాయులు పెరిగి, వెయిట్‌, మజిల్‌ మాస్‌ తగ్గడం మంచిది కాదు.  కాబట్టి.. ముందు షుగర్‌ను సాధారణ స్థాయికి తెచ్చుకోండి. ఇందుకు శరీరానికి మాంసకృతులు అందించండి. మీ బరువుకి తగ్గట్టు 60 గ్రా. ప్రొటీన్లు అవసరం. వెన్న తీసిన పాలు, పెరుగు, లో ఫ్యాట్‌ చీజ్‌, చికెన్‌, పనీర్‌, మాంసం, సోయా నగ్గెట్స్‌, పప్పుదినుసులను ఆహారంలో చేర్చుకోండి. చికెన్‌, గుడ్డు, చేపలు (100-150 గ్రా.) తీసుకోవచ్చు. అందులోనూ నూనె తక్కువుండాలి. నిదానంగా జీర్ణమయ్యే ఆహారం తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయులు నియంత్రణలోకి వస్తాయి. ఉదయం పెసరట్టు, ఉడకబెట్టిన శనగలు, అలసందలు, గుగ్గిళ్లు, ఉడికించిన గుడ్లు, ఓట్స్‌ జావల్లో ఏదోఒకటి తీసుకోవచ్చు. లంచ్‌లో దంపుడు బియ్యం, కొర్రలు, జొన్నరవ్వతో ఆకుకూరలు, సోయా నగ్గెట్స్‌, చికెన్‌ తినొచ్చు. సాయంత్రం మొలకెత్తిన గింజలు, పాలు, గుప్పెడు నట్స్‌, పండు... వీటిలో ఏదైనా తీసుకోండి. రాత్రి జొన్న కిచిడీ, సెనగపిండి, గోధుమపిండి కలిపి వేసిన మిస్సీ రోటీ లేదా రెండు పుల్కాలు, చికెన్‌/ సోయా నగ్గెట్స్‌ తినొచ్చు.

కండరాలను కాపాడుకోవడానికి నడక ఒక్కటే సరిపోదు. స్ట్రెంత్‌ ట్రైనింగ్‌ ఎక్సర్‌సైజ్‌లూ చేయాలి. ఫిజియోథెరపిస్ట్‌ సాయంతో రెసిస్టెంట్‌ బ్యాండ్స్‌, వెయిట్స్‌, క్రాస్‌ ట్రెయినర్‌, స్టేషనరీ సైక్లింగ్‌ లాంటివి చేయండి. కండరాల సామర్థ్యం, మొత్తం మజిల్‌ మాస్‌ పెరగడానికి సాయపడతాయి. షుగర్‌ కూడా నియంత్రణలోకి వస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని