మాస్క్‌ చాటున దాచేస్తోంది

మా అమ్మాయికి 17 ఏళ్లు. పెదవిపైన వెంట్రుకలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కళాశాలలో ఏడిపిస్తున్నారని ముఖానికి మాస్క్‌ కూడా తీయడం లేదు. పరిష్కార మార్గాలను సూచించండి.

Updated : 10 Dec 2021 04:44 IST

మా అమ్మాయికి 17 ఏళ్లు. పెదవిపైన వెంట్రుకలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కళాశాలలో ఏడిపిస్తున్నారని ముఖానికి మాస్క్‌ కూడా తీయడం లేదు. పరిష్కార మార్గాలను సూచించండి.

- ఓ సోదరి

వంశపారంపర్యం, హార్మోన్ల తేడా, పీసీఓడీ, టెస్టోస్టీరాన్‌ హార్మోన్‌ ఎక్కువగా విడుదలవ్వడం ఇలా దీనికి అనేక కారణాలున్నాయి. ఒక్కోసారి ఒత్తిడి వల్లా కావొచ్చు. ఎఫ్లోరోనిథిన్‌ క్రీమ్‌ను రాస్తే వెంట్రుకల పెరుగుదల తగ్గుతుంది. దీర్ఘకాల పరిష్కారానికి ట్రీట్‌మెంట్‌ తీసుకోవాలి. లేజర్‌తో 70 శాతం వరకూ తగ్గించొచ్చు. అలెగ్జాండ్రనేట్‌, డయోడ్‌, రూబీ, ఎండియాక్‌, ఐపీఎల్‌ లేజర్లు ఉంటాయి. పాప చర్మాన్ని బట్టి ఏది మంచిదో పరిశీలించి చేస్తారు. అయితే ఇవి ఒక్క సిట్టింగ్‌లో అయిపోవు. కనీసం 8 అవసరమవుతాయి. 4- 6 వారాల వ్యవధిలో చేస్తారు. దీనికి కనీసం 4-5 వారాల ముందు వ్యాక్స్‌, త్రెడింగ్‌ చేయించడం, హెయిర్‌ రిమూవల్‌ క్రీమ్‌లు వాడటం వంటివి చేయకూడదు. లేజర్‌ చేయించుకున్నాక కొంతమందిలో హైపర్‌ పిగ్మెంటేషన్‌ కనిపించినా కొన్ని వారాల్లోనే తగ్గిపోతుంది. పూర్తిగా సమస్య పరిష్కారం కావాలంటే.. ఎలక్ట్రోలిసిస్‌ చేయించుకోవచ్చు. అయితే దీనికి 6 నెలల నుంచి ఏడాది వరకూ పట్టొచ్చు. ప్రతిసారి 2-3 గంటలు పడుతుంది.

స్పూను చొప్పున పసుపు, శనగపిండి తీసుకుని నువ్వుల నూనె కలిపి రాయాలి. అరగంట తర్వాత కడిగేయాలి. పచ్చి బొప్పాయి పేస్ట్‌లో పసుపు కలిపి 15-20 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. బేకింగ్‌ సోడా, పసుపు నీళ్లతో కలిపి ముఖానికి రాసి, 15-20 నిమిషాలయ్యాక కడిగేసినా చాలు. వీటిని వారానికి రెండుసార్లు మూడు నెలలపాటు చేస్తే ప్రయోజనం ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని