నిద్రలేమికి ఆసనం

శరీరంలో ఏ భాగానికీ ఒత్తిడి, అలసట కలిగించకుండా సేద తీరుతున్నట్టుగా పడుకోవడమే యోగనిద్ర. దీనిలో శ్వాసమీద దృష్టిపెట్టి మనసుతో శరీర భాగాలను గమనించాలి. ఎక్కడైనా నొప్పిగా అనిపిస్తే శ్వాస దాని దగ్గరకు వెళ్తున్నట్లు

Updated : 19 Oct 2022 16:04 IST

రీరంలో ఏ భాగానికీ ఒత్తిడి, అలసట కలిగించకుండా సేద తీరుతున్నట్టుగా పడుకోవడమే యోగనిద్ర. దీనిలో శ్వాసమీద దృష్టిపెట్టి మనసుతో శరీర భాగాలను గమనించాలి. ఎక్కడైనా నొప్పిగా అనిపిస్తే శ్వాస దాని దగ్గరకు వెళ్తున్నట్లు ఊహించి, మెల్లగా వదలండి. ఆపై కీళ్లు, చీలమండ, కండరాలు, చర్మం, మోకాళ్లను గమనించండి. మోకాలిచిప్పల్లో ద్రవం ఉందా లేక ఎండిపోయినట్లుందో మీకు కనిపించాలి. తొడల లోపల, బయట గమనించి పొత్తికడుపు, పెద్దపేగు, మూత్రనాళాలు, మూత్రకోశం, పొట్ట పైభాగం, ఉదరభాగం, ఊపిరితిత్తులు అన్నిటినీ చూడండి. బాగా శ్వాస తీసుకుని, అది గుండె, తక్కిన భాగాలకి అందుతున్నట్లు భావించి ఊపిరితిత్తుల్ని క్లియర్‌ చేసుకోండి. లోపలున్న కాలుష్యాలన్నీ వెళ్లిపోవాలి. తర్వాత గుండె, రక్తప్రసరణ, థైరాయిడ్‌ గ్రంథి, స్వరతంత్రులు, గొంతు, రెండు చేతులనూ గమనించండి. ఇవన్నీ శరీరం కదలకుండా మనసుతో చేయాలి. తొడ నుంచి పిరుదులు, వెన్నుపూస, కండరాలు, వీపు, మెడ, తల వెనుక భాగం వరకూ గమనించండి. మెడ కండరాలను రిలాక్స్‌ చేయండి. హాయిగా శ్వాస తీసుకుని వదలండి. తల పైభాగమంతా పరిశీలించి సేదతీరి కళ్లు, ముక్కు, చెంపలు, పెదాలు, నోరు, చెవులను గమనించి, నుదుటి మధ్య ఆజ్ఞాచక్రం దగ్గర దృష్టిపెట్టండి. ‘శరీరంలో అన్ని భాగాలకూ శక్తినిచ్చాను ప్రతిదీ హాయిగా ఉంది’ అనుకుంటూ శ్వాస వదలండి. ఏ ఆలోచనలూ వద్దు. ఒకవేళ వచ్చినా తిరిగి శ్వాసమీద దృష్టిపెట్టండి. ఈ యోగనిద్రతో నిద్రలేమి సమస్య ఉండదు. ఒత్తిడి, ఆందోళన తగ్గి, రోగనిరోధకశక్తి మెరుగవుతుంది. అన్ని వయసులవారూ దీన్ని చేయొచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్