ఆస్తిలో ఆడపడుచూ వాటా అడుగుతోంది!

మా మామయ్య అత్తయ్య పేరు మీద 1987లో ఇల్లు కొన్నారు. ఆయన చనిపోయాక అత్తయ్య ఆ ఇంటిని కొడుకుల పేరు మీద ‘గిఫ్ట్‌ డీడ్‌’ రాసిచ్చారు. ఆమె కూడా గతేడాది చనిపోయారు.

Updated : 15 Dec 2021 03:52 IST

మా మామయ్య అత్తయ్య పేరు మీద 1987లో ఇల్లు కొన్నారు. ఆయన చనిపోయాక అత్తయ్య ఆ ఇంటిని కొడుకుల పేరు మీద ‘గిఫ్ట్‌ డీడ్‌’ రాసిచ్చారు. ఆమె కూడా గతేడాది చనిపోయారు. మేం ఆ ఇంటిని కూల్చి కొత్తది కట్టుకోవాలనుకుంటున్నాం.  ఇప్పుడు మా రెండో ఆడపడుచు కోర్టులో కేసు వేసింది.  తను ‘స్టే ఆర్డర్‌’ తెస్తే మేం ఏం చేయాలి? ఇందులో ఆమెకూ వాటా ఇవ్వాలా?

- హేమ, హైదరాబాద్‌

మీ మామయ్య మీ అత్తయ్య పేరు మీద కొనిచ్చిన ఆస్తి పూర్తిగా ఆవిడకే చెందుతుంది. అంటే ఆవిడ సొంతంగా సంపాదించిన ఆస్తి కింద పరిగణిస్తారు.సెక్షన్‌- 14(1) హిందూ వారసత్వ చట్టం-1956 ప్రకారం ఏదైనా ఆస్తి హిందూ స్త్రీ పేరు మీద బదలాయింపు జరిగినప్పుడు అంటే వారసత్వం/కొనుగోలు/ భాగస్వామ్యం/భరణం/ దానం/పెళ్లికి ముందు, తర్వాత/ స్త్రీ ధనంగా... లభించిన ఆస్తిని ఆమె సొంతంగా పరిగణిస్తారు. దాని మీద ఆమెకు దాన, విక్రయాది సర్వ హక్కులు ఉంటాయి. అలాంటప్పుడు మీ అత్తయ్య దానంగా ఇచ్చి, అది గిఫ్ట్‌డీడ్‌గా రిజిస్టర్‌ అయి ఉంటే కూతుళ్లకు దాన్ని ప్రశ్నించే హక్కు లేదు. మీ ఆడపడుచు కోర్టులో తనకు భాగం ఉందని కేసు ఎలా వేసిందో తెలియడం లేదు. గిఫ్ట్‌ డీడ్‌ రిజిస్టర్‌ అవకపోతే మాత్రం చెల్లుబాటు కాదు. మీ అత్తగారు బతికున్నప్పుడు ఏమైనా లావాదేవీలు నడిచాయా? పైన చెప్పిన పరిస్థితుల్లో ఆమెకు స్టే ఆర్డర్‌ రావడానికి అవకాశం లేదు. జరిగిన విషయాలన్నీ దాచిపెట్టి స్టే ఆర్డర్‌ తెచ్చుకుంటే మీరు కోర్టులో నిజాన్ని నిరూపించి వెకేట్‌ చేయించుకోండి.స్టే ఆర్డర్‌ లేకపోతే కట్టడానికి అభ్యంతరం లేదు. ఎలాంటి వీలునామా రాయకుండా చనిపోయి ఉంటే వారికీ వాటా వస్తుంది. లేకపోతే రాదు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్