Published : 16/12/2021 01:53 IST

పెద్ద జీతమున్నా పెళ్లవడంలేదు...

నేను బాగానే ఉంటాను. ఆరోగ్య సమస్యలు లేవు. నెలకు లక్షకు పైనే జీతం. కానీ ఏ సంబంధమూ కుదరడంలేదు. ఇందరు నిరాకరిస్తోంటే చాలా బాధేస్తోంది. ఈ దుఃఖం నుంచి బయటపడేదెలా?

- ఓ సోదరి


పెళ్లంటే అందమే కాదు, వ్యక్తిత్వం, చదువు, ఉద్యోగం, కుటుంబం లాంటివెన్నో చూస్తారు. మిమ్మల్ని కాదనుకుంటే అది వాళ్ల సమస్య. మీకేదో లోపం ఉండబట్టే నిరాకరిస్తున్నారని అనుకోవద్దు. మిమ్మల్ని మీరు కించపరచుకోకుండానే వాళ్ల ఆలోచనలను గౌరవించండి. అవతలి వ్యక్తి గనుక మీ ఆశలకు తగ్గట్టు లేకపోతే మీరైనా ఒప్పుకోరుగా! వాళ్లూ అలాగే ఆలోచించారనుకోండి. అలాగని మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవాల్సిన పనీ లేదు. పదిమంది కాదన్నంత మాత్రాన మీ విలువ తగ్గదు. మిమ్మల్ని మీరు గౌరవించుకోండి. మీ వృత్తి మీరు చక్కగా నిర్వహిస్తూ ఆత్మవిశ్వాసంతో, ఆనందంగా ఉండండి. తగిన వ్యక్తి దొరికినప్పుడు చేసుకోవచ్చు. కంగారుపడాల్సిందేమీ లేదు. బంధుమిత్రుల్లో మీకు ఎవరైనా నచ్చితే ఇంట్లో చెప్పండి, సంప్రదిస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్