వాళ్లను చంపేయాలనిపిస్తోంది...

నేను చదువుకునే రోజుల్లో లైంగిక వేధింపులకు గురయ్యాను. అవి గుర్తొస్తే వాళ్లను చంపేయాలన్నంత ఆవేశం వస్తుంది. ఇంట్లో పెళ్లి చేసుకోమంటున్నారు. కానీ నాకిష్టంలేదు. నేనేం చేస్తే బాగుంటుంది?

Published : 23 Dec 2021 01:17 IST

నేను చదువుకునే రోజుల్లో లైంగిక వేధింపులకు గురయ్యాను. అవి గుర్తొస్తే వాళ్లను చంపేయాలన్నంత ఆవేశం వస్తుంది. ఇంట్లో పెళ్లి చేసుకోమంటున్నారు. కానీ నాకిష్టంలేదు. నేనేం చేస్తే బాగుంటుంది?

 - ఓ సోదరి

లైంగిక వేధింపులకు పాల్పడేవాళ్లది పైశాచిక ఆనందం. తుపాను వచ్చినా చెట్టు గట్టిగా నిలబడినట్టు మనం దృఢంగా ఉంటే ఆ చేష్టలు శరీరాన్నే తప్ప మనసును బాధపెట్టలేవు. వాటికసలు ప్రాధాన్యతే ఇవ్వకూడదు. పెళ్లంటే సెక్సే కాదు, ఎల్లవేళలా తోడూ నీడగా ఉండటం. కనుక పెళ్లి ఒక అవసరం. ఎవరో వేధించారని, అదే మనసులో పెట్టుకుని అందరూ అలాగే ఉంటారనుకుని, ఆందోళన చెందుతూ జీవితంలో ముఖ్యమైన పెళ్లిని వద్దనుకుంటున్నారు. సమయం మించిన తర్వాత బాధపడీ ప్రయోజనం ఉండదని గుర్తుంచుకోండి. ఎవరో అజ్ఞానులు చేసినదానికి అవమానపడి, కుంగిపోతున్నారు. సైకియాట్రిస్టును కలిస్తే మీ మనసులో ఉన్న బ్లాక్స్‌ను అంచనావేసి కౌన్సిలింగ్‌ ఇస్తారు. భయాలు తొలగిస్తారు. ఆశావహ దృక్పథాన్ని కలిగించి ఆత్మవిశ్వాసాన్ని నింపుతారు. నెగెటివ్‌ ఆలోచనలను తొలగించి జీవితంలో పెళ్లి ప్రాముఖ్యత తెలియజేస్తారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని