జలుబూ దగ్గులను తరిమేద్దాం...
ఈ కాలంలో జలుబు, దగ్గు, ఉబ్బసం, శ్వాస ఇబ్బందులు, అలర్జీలతో సతమతమవుతుంటాం. అలాంటి సమస్యల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే ఈ ఆసనాలు వేయాల్సిందే... నామ ప్రణామాసనం... ముందుగా వజ్రాసనంలో కూర్చుని మోకాళ్ల మీద పిరుదులను పైకి లేపాలి. రెండు అర చేతులను కింద పెట్టి ముందుకు వంగి, నుదురు కన్నా పై భాగాన్ని సరిగ్గా మోకాళ్లకి ఎదురుగా...
ఈ కాలంలో జలుబు, దగ్గు, ఉబ్బసం, శ్వాస ఇబ్బందులు, అలర్జీలతో సతమతమవుతుంటాం. అలాంటి సమస్యల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే ఈ ఆసనాలు వేయాల్సిందే...
నామ ప్రణామాసనం... ముందుగా వజ్రాసనంలో కూర్చుని మోకాళ్ల మీద పిరుదులను పైకి లేపాలి. రెండు అర చేతులను కింద పెట్టి ముందుకు వంగి, నుదురు కన్నా పై భాగాన్ని సరిగ్గా మోకాళ్లకి ఎదురుగా కింద ఆనించాలి. చేతులతో పాదాలను పట్టుకుని మోకాళ్ల నుంచి పిరుదుల వరకూ తిన్నగా ఉంచాలి. ఈ ఆసనంలో మామూలుగా శ్వాస తీసుకుని వదులుతూ కొంతసేపు ఉండాలి. తర్వాత చేతులూ తీసి కింద పెట్టుకుని వజ్రాసనంలో వెనక్కి కూర్చుని సేద తీరాలి. అలా మూడుసార్లు చేయాలి. దీనివల్ల రక్తప్రసరణ బాగుంటుంది. చర్మం పొడిబారదు. కాంతిమంతమవుతుంది. మొటిమలు, నల్లగా అయిపోవడం, జుట్టు రాలడం, చుండ్రు లాంటి చలికాల సమస్యలనూ నివారిస్తుంది. తల తిరగడం, అధిక రక్తపోటు ఉన్నవారు మాత్రం ఈ ఆసనం వేయద్దు.
సరళ మత్స్యాసనం... వెల్లకిలా పడుకుని రెండు కాళ్లూ దగ్గరికి ఆనించాలి. చేతులు తల పక్కన భుజాల దగ్గర పెట్టి మెల్లగా తల పైకి లేపి తల పైభాగాన్ని నేల మీద ఆనించాలి. చేతులు తీసి పిరుదుల పక్కన కానీ తొడల మీద గానీ నిటారుగా పెట్టాలి. చేతులు తీస్తే కష్టమనిపిస్తే కొన్నిరోజులు అలాగే ఉంచి చేస్తూ తర్వాత తీసేయొచ్చు. ఈ ఆసనంలో ఉండగలిగినంతసేపు ఉండి రెండు చేతులూ మళ్లీ భుజాల పక్కన పెట్టి చేతుల మీద బరువేసి తలను యథా స్థితిలో ఉంచాలి. ఒకేసారి తలను లాగకుండా చాలా నెమ్మదిగా చేయాలి. చర్మం, పొట్ట భాగాలకు, మలబద్ధక సమస్యకు ఇదెంతో మంచిది. మెడ, నడుం, వెన్ను పట్టేయడం, ఒళ్లునొప్పులు, బద్ధకం, జుట్టు రాలడం, థైరాయిడ్ సమస్యలను నివారిస్తుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇదయ్యాక శవాసనంలో 3 నిమిషాలు ఉండి సర్వాంగాసనం వేయాలి. అప్పుడే పూర్తి ప్రయోజనం ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.