అన్నయ్యకు ఏ పనీ చెప్పరు!

డిగ్రీ చదువుతున్నా. గతంలో చాలా మంచి మార్కులొచ్చేవి. కానీ కరోనా తర్వాత చదువు మీద ధ్యాస పెట్టలేకపోతున్నా. అమ్మానాన్నా రోజంతా ఏవో పనులు చెబుతూనే ఉంటారు. అన్నయ్య ఎప్పుడూ టీవీ ముందే ఉన్నా తనకి ఒక్క పనీ చెప్పరు. ప్రతిసారీ నాకే ఎందుకు చెబుతారంటే తిడతారు. నాకు చాలా కోపం వస్తోంది. ఆడపిల్లనై ఎందుకు పుట్టానా అని ఏడ్చేస్తున్నా. నా కోపం, బాధ తగ్గడానికి సలహా ఇవ్వండి. 

Published : 17 Jan 2022 00:18 IST

- అంజలి, నెల్లూరు

పిల్లలు పనులు నేర్చుకుని ఇంట్లో సాయం చేయడమనేది మామూలే. చిన్నప్పటి నుంచీ నేర్చుకుంటే సామర్థ్యం పెరుగుతుంది,  ఇక్కడ ఆడా, మగా వ్యత్యాసాల ప్రస్తావన కాదు. చదువుతోపాటు వంట చేయడం, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం లాంటి పనులు నేర్చుకుంటే పై చదువులు లేదా ఉద్యోగాల కోసం ఎక్కడికి వెళ్లినా అన్నీ సొంతంగా చేసుకోగలరు. పెళ్లయ్యాక ఇంటిని చక్కబెట్టుకోవచ్చు. కాబట్టి ఇదంతా నేర్చుకునేక్రమం అనుకోవాలి. అమ్మకు సహాయం చేయాలనే సానుభూతి ఉండాలి. చదువుకునే వేళలు నిర్ణయించుకుని, ‘ఆ సమయంలో పనులు చెబితే మంచి మార్కులు రావు కదా! అంతకు ముందు లేదా ఆ తర్వాత చేస్తాను’ అని అమ్మానాన్నలకి అర్థమయ్యేలా చెప్పాలి. పని గురించి బాధపడే కంటే ‘అమ్మకి సాయం చేస్తున్నాను, దీనివల్ల నాకూ నైపుణ్యం పెరుగుతుంది. నా వల్ల కుటుంబానికి మేలు జరుగుతుంది’ అని ఆశావహంగా ఆలోచించాలి. ఇంకొకరితో పోటీ వద్దు. ఇవేవీ వృథా పోవు, నువ్వే వృద్ధిచెందుతావని గుర్తుంచుకో!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని