పెదవిపై ఈ మచ్చేంటి?

వయసు 25 ఏళ్లు. పదేళ్ల క్రితం కింది పెదవిపై తెల్ల మచ్చ వచ్చింది. గత కొన్నేళ్లుగా అది పెదవంతా వ్యాపిస్తోంది. వైద్యుల్ని కలిశా. కొందరు ఒంట్లో వేడి కారణమంటే.. ఇంకొందరు పోషకాహార లోపమంటున్నారు. సోరియాసిస్‌లో రకమనీ చెబుతున్నారు. తగ్గించే మార్గం చెప్పండి.

Updated : 01 Feb 2022 04:20 IST

వయసు 25 ఏళ్లు. పదేళ్ల క్రితం కింది పెదవిపై తెల్ల మచ్చ వచ్చింది. గత కొన్నేళ్లుగా అది పెదవంతా వ్యాపిస్తోంది. వైద్యుల్ని కలిశా. కొందరు ఒంట్లో వేడి కారణమంటే.. ఇంకొందరు పోషకాహార లోపమంటున్నారు. సోరియాసిస్‌లో రకమనీ చెబుతున్నారు. తగ్గించే మార్గం చెప్పండి.

- ఓ సోదరి

దీన్ని లూకోడర్మా, లిప్‌ విటిలిగోగా చెబుతాం. ఇదో ఆటోఇమ్యూన్‌ సిస్టమ్‌ డిజార్డర్‌. దీనికి ఇదే కారణమని కచ్చితంగా చెప్పలేం. చాలావరకూ వంశపారంపర్యం. ఒత్తిడి, ట్రామా, ఎక్కువగా పెదాలను తడుపుతుండే వారిలోనూ కనిపిస్తుంది. వంశపారంపర్యమైతే చిన్నప్పటి నుంచీ ఉంటుందన్న అపోహ ఉంటుంది. కానీ వయసుతో నిమిత్తం లేకుండా ఎప్పుడైనా రావొచ్చు. మీరనుకుంటున్నట్లుగా అనారోగ్య సమస్య మాత్రం కాదు. మెలనోసైట్లు తగ్గడమూ కారణమే. వీటిని పూర్తిగా తొలగించలేం. కానీ పెరగకుండా ఆపొచ్చు. కొందరిలో పెదవి మీద ఒక చోట వచ్చి, అక్కడికే పరిమితమవుతుంది. ముందు వీరిని పులుపు పదార్థాలను తినడం మానేయమని చెబుతాం. తర్వాత పైపూతగా.. టాక్రోలిమస్‌ 0.1, హైడ్రోకార్టిజాన్‌ క్రీములను రోజుకు రెండుసార్లు రాయాలి. మెడికల్‌ మేకప్‌లనూ వాడొచ్చు. అప్పటికీ తగ్గకపోతే యూవీ బీ ఫొటోథెరపీ సూచిస్తాం. ఇంకొందరిలో అది రానురానూ పెదవంతా వ్యాపిస్తుంది. దీన్ని అన్‌స్టేబుల్‌ విటిలిగో అంటాం. వీళ్లకి సర్జికల్‌ ట్రీట్‌మెంట్‌ తప్పనిసరి. అంటే.. సెల్స్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌, మైక్రో పిగ్మెంటేషన్‌, టాటూయింగ్‌, మెలనోసైట్స్‌ గ్రాస్పింగ్‌ వంటివి చేయాల్సి ఉంటుంది. వైద్య నిపుణుడిని సంప్రదించి, తగిన చికిత్స తీసుకోండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని