ఇంటిపేరు మార్చుకోవాలా?

పెళ్లిని రిజిస్ట్రేషన్‌ చేసుకునే సమయంలో అమ్మాయి ఇంటి పేరును మార్చుకోవడం తప్పనిసరా? నేను ఉద్యోగం చేస్తున్నా. నా పుట్టింటి పేరును మార్చుకోవడం నాకిష్టం లేదు.

Updated : 02 Feb 2022 05:00 IST

పెళ్లిని రిజిస్ట్రేషన్‌ చేసుకునే సమయంలో అమ్మాయి ఇంటి పేరును మార్చుకోవడం తప్పనిసరా? నేను ఉద్యోగం చేస్తున్నా. నా పుట్టింటి పేరును మార్చుకోవడం నాకిష్టం లేదు. మార్చుకోకపోతే భవిష్యత్తులో ఏమైనా సమస్యలు వస్తాయా?

-ఓ సోదరి

పెళ్లయిన తర్వాత మీ పుట్టింటి పేరు మార్చుకోవాలని చట్టపరంగా ఎక్కడా లేదు. కానీ పెళ్లి రిజిస్ట్రేషన్‌ సమయంలో సాధారణంగా మీ ఇంటి పేరును మార్చి రిజిస్ట్రేషన్‌ చేస్తారు. ఇది కూడా తప్పనిసరి కాదు. విదేశాలకు వెళ్లాలనుకునేవారు సర్టిఫికెట్‌ చూపించి వీసాకి దరఖాస్తు చేసుకుంటారు. మీరు పుట్టింటి పేరును మార్చుకోకపోతే మీకు భవిష్యత్తులో ఎలాంటి సమస్యలూ రావు. కానీ, గవర్నమెంట్‌ డాక్యుమెంట్స్‌లో మీ పేరు, భర్త పేరు వగైరా పూర్తి చేసేటప్పుడు ఇంటి పేరు మార్చుకోకపోవడం వల్ల కొద్దిగా కన్‌ఫ్యూజన్‌ వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా కొంతమంది కొన్ని చోట్ల భర్త ఇంటి పేరుతో, మరికొన్ని చోట్ల అసలు పేరుతో రెండు విధాలా వాడుతుంటారు. దానివల్ల ఎలాంటి ఇబ్బంది రాదు. విడాకులు తీసుకున్న వాళ్లు మళ్లీ పుట్టింటి పేరును ఉపయోగించే దాఖలాలు కూడా ఉన్నాయి. ఏదైనా ఇబ్బంది రానంత వరకు సరే. ఎవరైనా అడిగినప్పుడు మార్చుకోలేదని చెప్పాల్సి వస్తుంది. అంతే. చాలామంది పెళ్లయిన తర్వాత కూడా తండ్రి ఇంటి పేరును కొనసాగించడం మన దేశంలో సాధారణమే.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని