నలుపు పోవాలంటే..?

హైపర్‌ పిగ్మెంటేషన్‌.. అంటే చర్మంలో మెలనిన్‌ శాతం పెరగడం. వయసు పెరగడం, ఎండకు ఎక్కువగా తిరగడం, జుట్టుకు వేసే రంగుతోపాటు చర్మ సమస్యలూ కారణమవొచ్చు. ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యత, నిద్రలేమి, కొత్తగా వాడుతున్న ఉత్పత్తులు పడకపోవడం, గడువు దాటిన వాటితో దుష్ప్రభావాలు... వంటి వాటివల్లా పిగ్మెంట్‌ పెరుగుతుంది. ముందు ఆహారంపై దృష్టిపెట్టండి. డెయిరీ పదార్థాలు, చక్కెర, గ్లుటెన్‌, కెఫిన్‌, నిల్వ ఆహార పదార్థాలు, కారం తగ్గించండి. యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్‌,

Published : 09 Feb 2022 01:07 IST

వయసు 41. ముఖమంతా నలుపు రంగులోకి మారుతోంది. ఫేషియల్స్‌ చేయించా, హోమియోపతి మందులూ వాడా. ఇంకేం చేయాలి?

- ఓ సోదరి


హైపర్‌ పిగ్మెంటేషన్‌.. అంటే చర్మంలో మెలనిన్‌ శాతం పెరగడం. వయసు పెరగడం, ఎండకు ఎక్కువగా తిరగడం, జుట్టుకు వేసే రంగుతోపాటు చర్మ సమస్యలూ కారణమవొచ్చు. ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యత, నిద్రలేమి, కొత్తగా వాడుతున్న ఉత్పత్తులు పడకపోవడం, గడువు దాటిన వాటితో దుష్ప్రభావాలు... వంటి వాటివల్లా పిగ్మెంట్‌ పెరుగుతుంది. ముందు ఆహారంపై దృష్టిపెట్టండి. డెయిరీ పదార్థాలు, చక్కెర, గ్లుటెన్‌, కెఫిన్‌, నిల్వ ఆహార పదార్థాలు, కారం తగ్గించండి. యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్‌, విటమిన్లు ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలను బాగా తీసుకోండి. ఒమెగా 3,6 ఫ్యాటీ ఆసిడ్లు, ప్రోబయాటిక్స్‌ ఎక్కువగా ఉండే చేప, గుమ్మడి గింజలు, గ్రీన్‌టీ, నిమ్మ, తేనె, బాదం, ఆలివ్‌ నూనె, బ్రకోలి, వెనిగర్‌, చిలగడ దుంప వంటి వాటికి ప్రాధాన్యమివ్వాలి. ఇవి వృద్ధాప్య ఛాయల్ని తగ్గించడంతోపాటు చర్మం నిర్జీవమవకుండా కాపాడతాయి. రోజులో కనీసం 3 లీ. నీటిని తాగాలి. ముఖానికి నిమ్మరసాన్ని రుద్ది కడిగాక, టీ స్పూను బ్రౌన్‌ షుగర్‌, పంచదారకు కొద్దిగా నీటిని కలిపి పేస్ట్‌లా చేసి, స్రబ్‌లా ఉపయోగించండి. కడిగేశాక మాయిశ్చరైజర్‌ రాస్తే సరి. టీస్పూను తేనెకు కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి, పది నిమిషాల తర్వాత తీసేయండి. గుడ్డు సొనకు రెండు స్పూన్ల తేనె, ఓట్‌ పొడి కలిపి ముఖానికి రాసి 20 నిమిషాలు ఉంచండి. బాదం పొడికి తగినన్ని పాలు లేదా దాల్చిన చెక్క పొడికి తేనె.. కలిపి రాసుకున్నా మంచిదే. వీటిని వారానికి రెండుసార్లు రాత్రిపూట ప్రయత్నించొచ్చు. నెలకోసారి కెమికల్‌ పీల్‌ కూడా చేయించండి. వైద్యుని సాయంతో మీ చర్మానికి తగ్గ మాయిశ్చరైజర్‌ ఎంచుకోండి. సన్‌స్క్రీన్‌ తప్పనిసరి. డే, నైట్‌ క్రీమ్‌లతోపాటు సబ్బుకు బదులుగా ఫేస్‌వాష్‌ వాడండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని