స్నేహితులే ఏడిపిస్తున్నారు!

డిగ్రీ చదువుతున్నా, 19 ఏళ్లు. నా ముక్కు వెడల్పుగా ఉందని స్నేహితులే ఏడిపిస్తున్నారు. ప్లాస్టిక్‌ సర్జరీతో మార్చుకునే అవకాశముందా? ఎంత వరకూ ఖర్చు అవుతుంది?

Published : 28 Feb 2022 01:18 IST

డిగ్రీ చదువుతున్నా, 19 ఏళ్లు. నా ముక్కు వెడల్పుగా ఉందని స్నేహితులే ఏడిపిస్తున్నారు. ప్లాస్టిక్‌ సర్జరీతో మార్చుకునే అవకాశముందా? ఎంత వరకూ ఖర్చు అవుతుంది?

- ఓ సోదరి

మీ వయసు రీత్యా ముఖాకృతి పూర్తిగా ఏర్పడి ఉంటుంది. కాబట్టి, కాస్మటిక్‌ సర్జరీ చేయించుకోవచ్చు. ముక్కు మొదలు భాగంలో ఎక్కువగా ఎముకే ఉంటుంది. దీన్నే నాసల్‌ బోన్‌ అంటాం. దీనివల్లే ఆకారం ఏర్పడుతుంది. మీ ముక్కు లావును తగ్గించడానికి శస్త్రచికిత్సలో భాగంగా ఇక్కడి ఎముకల్ని సన్నగా చేస్తారు. కొన్నిసార్లు ముక్కు పైభాగపు ఎత్తును పెంచి కూడా కొనదేలినట్లుగా కనిపించేలా చేస్తారు. దీన్ని నాన్‌ సర్జికల్‌ సర్జరీ ద్వారా ఫిల్లర్‌ ఇంజక్షన్‌ ఇచ్చి చేస్తారు. ముక్కు కింద భాగం ఎముకలతో కాక కార్టిలేజ్‌తో రూపొంది ఉంటుంది. దీన్ని సరిచేయడం ద్వారా సన్నగా చేయొచ్చు. దీన్ని డోర్సెల్‌ ఆగ్‌మెంటేషన్‌గా చెబుతాం. నాసిక రంధ్రాలు, ముక్కు పుటాలు, మొన పెద్దగా, లావుగా ఉంటే శస్త్రచికిత్స ద్వారా సరిచేయొచ్చు. చేసిన తాలూకూ మచ్చలు కనిపించకుండా జాగ్రత్త తీసుకుంటారు. కాబట్టి, నిరభ్యంతరంగా చేయించుకోవచ్చు. ఇప్పటివరకూ సినీనటులే వీటిని ఎక్కువగా చేయించుకునేవారు. ఇప్పుడు అందరూ చేయించుకుంటున్నారు. అయితే దీనికి బోలెడు పరీక్షలు చేయాల్సి ఉంటుంది. అన్నీ బాగుంటేనే సర్జరీ చేస్తాం. ఖరీదు చేయించుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇంప్లాంట్స్‌ వాడితే ఒకలా, వాడకపోతే ఒకలా ఉంటుంది. సాధారణంగా 2 లక్షల వరకూ ఉంటుంది. ముక్కు, ఆకారం, తీరు పరీక్షిస్తే కానీ అసలు ధర చెప్పలేం. కాకపోతే ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉండవు. కాబట్టి, ప్రయత్నించొచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని