ఉద్యోగం ఇవ్వలేదు... పింఛనూ రావట్లేదు..
మా అమ్మానాన్నలు ఇద్దరూ మున్సిపాలిటీ గవర్నమెంట్ ఉద్యోగులు. నాన్న 2000లో, అమ్మ 2004లో చనిపోయారు. వాళ్లు పోయే నాటికి మేం మైనర్లం. ఇప్పటి వరకు వారి తరఫున రావాల్సిన పెన్షన్ కానీ, ఉద్యోగాలు కానీ రాలేదు. ఇంకా వాటి కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాం.
మా అమ్మానాన్నలు ఇద్దరూ మున్సిపాలిటీ గవర్నమెంట్ ఉద్యోగులు. నాన్న 2000లో, అమ్మ 2004లో చనిపోయారు. వాళ్లు పోయే నాటికి మేం మైనర్లం. ఇప్పటి వరకు వారి తరఫున రావాల్సిన పెన్షన్ కానీ, ఉద్యోగాలు కానీ రాలేదు. ఇంకా వాటి కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాం. ఇప్పుడు నా వయసు 26, తమ్ముడి వయసు 24.
- ఓ సోదరి
మీ తల్లిదండ్రులు చనిపోయాక వాళ్ల పింఛన్ వ్యవహారాలు ఎవరు చూశారు? సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ చనిపోతే వారి పిల్లల్లో అర్హత ఉన్నవారికి ఆ శాఖలోనే తగిన ఉద్యోగం ఇస్తుంటారు. కానీ ఎక్కువ మంది పిల్లలున్నా, ఇద్దరు భార్యలున్నా ఏది కావాలో తేల్చుకుని చెప్పమంటారు. అంటే ఉద్యోగం ఎవరికి? బెనిఫిట్స్ ఎవరికి ఇవ్వాలి అని ఒప్పందం చేసుకుని, ఆ ఒప్పంద పత్రం డిపార్ట్‌మెంట్ వారికి అందజేయాలి. అప్పుడు దాన్ని పై అధికారుల ముందు పెట్టి కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. మీ అమ్మానాన్నలిద్దరూ ఉద్యోగంలో ఉండగానే చనిపోయారా, రిటైర్ అయిన తర్వాత చనిపోయారా చెప్పలేదు. సాధారణంగా పెన్షన్ రాకుండా ఉండదు. అప్పుడు మీ తరఫున ఎవరైనా దరఖాస్తు పెట్టారో లేదో తెలియడం లేదు. ఒకవేళ పెట్టకపోతే మీరు మేజర్ అయిన ఏడాదిలోగా పెట్టాలి. రిటైర్‌మెంట్ లేదా డెత్ బెనిఫిట్స్ అంటే... గ్రాట్యుటీ, ప్రావిడెంట్ ఫండ్, ఇంకా ఉద్యోగరీత్యా ఇతరత్రా రావాల్సినవి కచ్చితంగా మీకు చెందాలి. అవి కూడా రాలేదూ అంటే మీ తల్లిదండ్రుల రికార్డులు పరిశీలించి ఎవరైనా తీసుకున్నారా... లేకపోతే ఎందుకు రాలేదనే విషయాలు తెలుసుకోవాలి. మీ అమ్మానాన్నలతోపాటు పనిచేసినవారినెవరినైౖనా సాయం చేయమని అడగండి. లేదా మీరు చేసిన ప్రయత్నాల్లో ఏదైనా దరఖాస్తు పెట్టి ఉంటే హైకోర్టులో కేసు వేసి మీకు రావాల్సిన పరిహారాలు పొందడానికి అవకాశం ఉంది. ఇప్పటికే చాలా ఆలస్యం చేశారు. వీలైనంత తొందరగా ప్రయత్నాలు మొదలుపెట్టండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.