దృష్టి మళ్లించడం ఎలా?

మా ఇద్దరు పిల్లలూ వీడియో గేమ్స్‌కు బానిసలయ్యారు. ఇప్పటికే చూపు తగ్గింది, ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చాయి అయినా ఫోన్‌ వదలరు. వాళ్లను పుస్తకాల వైపు ఎలా మళ్లించాలో కాస్త చెప్పండి!   

Published : 02 Mar 2022 00:57 IST

మా ఇద్దరు పిల్లలూ వీడియో గేమ్స్‌కు బానిసలయ్యారు. ఇప్పటికే చూపు తగ్గింది, ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చాయి అయినా ఫోన్‌ వదలరు. వాళ్లను పుస్తకాల వైపు ఎలా మళ్లించాలో కాస్త చెప్పండి!          

 - ఓ సోదరి, సూర్యాపేట

ఆన్‌లైన్‌ క్లాసుల మూలంగా పిల్లలకు స్మార్ట్‌ ఫోన్‌ ఇవ్వాల్సివప్తోంది. చదువు కంటే ఆటలూ వీడియోలూ ఆసక్తిగా ఉంటాయి కనుక వాళ్లు అటువైపు ఆకర్షితులవుతారు. ముందు నుంచీ చదువు వేళల్లోనే సెల్‌ఫోన్‌ అని ఒప్పందం చేసుకుంటే సమస్య రాదు. కొందరు పిల్లలు మొండివైఖరితో వాటికి బానిసలవుతున్నారు. ఇలాంటప్పుడు వారి ఇష్టాలకు అనుగుణంగా మనోవికాసం కలిగిస్తూ సృజనాత్మకంగా ఉండే అంశాలను పరిచయం చేయాలి. వీడియో గేమ్స్‌ నుంచి మళ్లించడానికి ఎవరైనా కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉన్నవాళ్లతో ప్రోగ్రామింగ్‌, యానిమేషన్‌ లాంటివి నేర్పించండి. సాధారణంగా పిల్లలకు తమకంటే పై స్థాయి అంశాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. అలా తర్ఫీదు పొందాక సొంతంగా ప్రయోగాలు చేయమనండి. అప్పుడు ఫోన్‌ దుర్వినియోగం కావడానికి బదులు ప్రయోజనకరంగా ఉంటుంది. ఆ విషయాల్లో పిల్లలిద్దరికీ పోటీ పెట్టండి…. ఇతర చిన్నారులూ పాల్గొనేలా చూడండి. ఇవి అడిక్ట్‌ చేసే అంశాలు కాదనందున గంటల తరబడి ఫోన్‌ పట్టుకోరు. ఈ నైపుణ్యాలు దుష్ప్రభావాల నుంచి దూరం చేయడమే కాదు, మేధస్సును పెంచుతాయి. అప్పుడిక తమకంటూ లక్ష్యాలు ఏర్పరచుకుని వాళ్లే చదువుకుంటారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని