బలవంతంగా మార్చలేరు...
నాకు ఇద్దరు పిల్లలు. పాప బాగా చదువుతుంది. కానీ బాబు పెద్దగా చదవలేడు. ఇంటర్ మొదటి సంవత్సరంలో రెండు సబ్జెక్టులు పోయాయి. కాలేజీలో అడిగితే మీ అబ్బాయి నిర్లక్ష్యంగా ఉన్నాడు. చివరి బెంచీలో కూర్చుని ఏదో చేస్తుంటాడు.
నాకు ఇద్దరు పిల్లలు. పాప బాగా చదువుతుంది. కానీ బాబు పెద్దగా చదవలేడు. ఇంటర్ మొదటి సంవత్సరంలో రెండు సబ్జెక్టులు పోయాయి. కాలేజీలో అడిగితే మీ అబ్బాయి నిర్లక్ష్యంగా ఉన్నాడు. చివరి బెంచీలో కూర్చుని ఏదో చేస్తుంటాడు. పాఠాలు వినకపోతే మేమేం చేయగలం అంటున్నారు. ఇంట్లో ఫోను, టీవీతో కాలం వృథా చేస్తాడు. చదవమంటే కోపం. పుస్తకాలు తీస్తాడు కానీ చదవడు. పదేపదే చెబితే తలనొప్పనో, నిద్రనో చెప్పి వెళ్లిపోతాడు. నేను పిల్లలతో స్నేహంగా ఉంటాను. అదే అలుసైపోయింది. ఎంత చెప్పినా వినడేంటని కోపం, ఆందోళన...
ఒక సోదరి, వరంగల్
మీరు చెబుతున్నదాన్ని బట్టి మీ బాబులో సాధారణం కంటే తక్కువ స్థాయి తెలివితేటలున్నాయి. ఇలాంటి పిల్లలు అత్తెసరు మార్కులతో పాసవుతారు. విషయం అవగాహన కాకపోవడం వల్ల ధ్యాస మళ్లి మరేదో చేస్తుంటారు. ఈ సమస్య ఉన్నప్పుడు బలవంతపెట్టినంతలో మార్పు రాదు. పరీక్షలు దగ్గరపడ్డాయి కనుక అతనికి చేతనైౖనట్లు రాయనివ్వండి. తర్వాత మానసిక వైద్యునికి చూపించండి. అటెన్షన్ డెఫిషిట్ హైపరాక్టివిటీ డిజార్డర్ (ఎడిహెచ్‌డి) ఉందేమో, ఐక్యూ స్థాయి ఎంత ఉందో పరీక్షిస్తారు. దీనికి మందులున్నాయి. ఈ రకమైన పిల్లలను ఏ పద్ధతిలో చదివించాలో మీకు తర్ఫీదిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.