విటమిన్ల కొరత తీర్చే ముద్ర...

చాలామంది మహిళలల్లో విటమిన్లు, ఖనిజాలు తగినంతగా లేక బలహీనంగా ఉన్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆ సమస్యను పోషకాహారంతో నివారించుకోవాలనేది మనందరికీ తెలిసిందే. యోగాలోనూ దీనికి పరిష్కార మార్గం ఉంది. అదే భూమి లేదా భూస్పర్శ ముద్ర.

Updated : 13 Mar 2022 01:46 IST

చాలామంది మహిళలల్లో విటమిన్లు, ఖనిజాలు తగినంతగా లేక బలహీనంగా ఉన్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆ సమస్యను పోషకాహారంతో నివారించుకోవాలనేది మనందరికీ తెలిసిందే. యోగాలోనూ దీనికి పరిష్కార మార్గం ఉంది. అదే భూమి లేదా భూస్పర్శ ముద్ర.

ముందుగా సౌకర్యంగా కూర్చోవాలి. తర్వాత చూపుడు, మధ్యవేళ్లు మడిచి దానిమీద బొటనవేలు ఉండేలా నేలను తాకించి ఉంచాలి. భూమిలో ఉన్న శక్తి మీ చేతుల ద్వారా శరీరమంతటికీ వెళ్తున్నట్టు మనసులో భావించండి. ఈ ముద్ర 4-5 నిమిషాల వరకూ చేయాలి. ఎందుకంటే విశ్వశక్తి (కాస్మిక్‌ ఎనర్జీ) ఆకాశం నుంచి భూమి వైపు వస్తుంది. దాన్ని భూమి ఆకర్షించి తనలో నింపుకుంటుంది. ఉదయం ఐదు నుంచి ఆరు గంటల మధ్య ఆ శక్తిమంతమైన తరంగాలు (మ్యాగ్నెటిక్‌ ఎలక్ట్రో వేవ్స్‌) భూమి నుంచి పైకి వస్తాయి. కనుక ఈ ముద్ర ఆ సమయంలో మాత్రమే చేయాలి. ఆ తరంగాలను గ్రహించడం వల్ల మూలాధార చక్రం బలపడుతుంది. మన శరీరం సమతులంగా ఉంటుంది. ముఖ్యంగా విటమిన్లు, ఖనిజాల కొరత ఉండదు. అలాగే స్థిరత్వం లేనివాళ్లు, మానసిక స్థైర్యం, ఆత్మవిశ్వాసం లేనివాళ్లు, భయపడుతూ ఉండేవాళ్లకి ఇదెంతో ప్రయోజనకరం. ఈ ముద్రను గచ్చు మీద కాకుండా మట్టి మీద చేయడం వల్ల ఫలితం ఉంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్