నాన్న వాటా కూడా అమ్మేశారు!

నాకు 36. మా నాయనమ్మకు నలుగురు మగ సంతానం. నా చిన్నతనంలోనే మా నాన్న వృత్తి రీత్యా బయటకు వెళ్లి కనపడకుండా పోయారు. నానమ్మకు పుట్టింటి నుంచి వారసత్వంగా రెండు ఎకరాల పొలం వచ్చింది. వారసత్వం కాబట్టి నాయనమ్మ

Published : 15 Mar 2022 00:53 IST

నాకు 36. మా నాయనమ్మకు నలుగురు మగ సంతానం. నా చిన్నతనంలోనే మా నాన్న వృత్తి రీత్యా బయటకు వెళ్లి కనపడకుండా పోయారు. నానమ్మకు పుట్టింటి నుంచి వారసత్వంగా రెండు ఎకరాల పొలం వచ్చింది. వారసత్వం కాబట్టి నాయనమ్మ తర్వాత ఆ పొలం మా నాన్నవాళ్ల నలుగురు అన్నదమ్ములకు సమానంగా వాటా రావాలి. కానీ మా నాన్న వాటా కూడా మిగతా ముగ్గురే అనుభవిస్తూ మొత్తం భూమిని ఇతరులకు విక్రయించారు. మేము మా వాటా భూమి కోసం ఎలా న్యాయ పోరాటం చేయాలో సలహా ఇవ్వండి.

- ఎ.లక్ష్మీదేవి, నంద్యాల

వరైనా ఒక మనిషి కనపడకుండా పోతే, ఎవిడెన్స్‌ యాక్ట్‌, సెక్షన్‌-108 ప్రకారం ఏడు సంవత్సరాల తర్వాత అతడిని చనిపోయినట్టుగా భావిస్తారు. మీ నానమ్మకు పుట్టింటి వారు ఇచ్చిన ఆస్తి హిందూవారసత్వ చట్టం, సెక్షన్‌-15 ప్రకారం పిల్లలందరికీ సమానంగా పంచాలి. అంటే ఆవిడ వీలునామా రాయకుండా చనిపోయి ఉంటే ఆమె తదనంతరం పిల్లలకు సమానంగా వస్తుంది. సెక్షన్‌-16, క్లాజ్‌ (ఎ) ప్రకారం పిల్లలతోపాటు చనిపోయిన పిల్లల వారసులు కూడా భాగస్తులవుతారు. మీ నాన్న గారి వాటా మీకు పంచమని అడిగి ఉండాల్సింది. కనీసం వాళ్లు అమ్మకుండా కోర్టు ద్వారా స్టే ఆర్డర్‌ తెచ్చుకుని ఉండాల్సింది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. క్యాన్సిలేషన్‌ ఆఫ్‌ సేల్‌ డీడ్‌ కోసం దావా వేయండి. మీ నాన్నగారి అన్నదమ్ములను, కొనుక్కున్న వారిని కూడా ప్రతివాదులుగా చేర్చండి. ఎవరెవరికి అమ్మారు. ఎన్ని విక్రయ దస్తావేజులు అయ్యాయో అన్ని కేసులు వేయాలి. మీరు చాలా ఆలస్యం చేశారు. వీలైతే లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ వారిని సంప్రదించి మీ తరఫున న్యాయవాదిని ఏర్పాటు చేయించుకోండి. లీగల్‌ హేర్‌ సర్టిఫికెట్‌ కూడా తెచ్చుకోండి.  ఎవరెవరికి అమ్మారో వాళ్ల పేర్లు, చిరునామాల్లాంటివీ తొందరగా సంపాదిస్తే మంచిది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని