ముగ్గురు మౌనికలు!

కోర్టులో పిలిచినట్లు మూడుసార్లు పిలుస్తున్నారేంటి అనుకుంటున్నారా? అదేం కాదండీ. వాళ్లు ముగ్గురూ స్నేహితురాళ్లు. అందరి పేర్లూ మౌనికనే. కాకపోతే ఒకరు మోరె మౌనిక మరొకరు సిబ్బుల మౌనిక. ఇంకో అమ్మాయి కుంట మౌనిక. ముగ్గురూ నిర్మల్‌ జిల్లా లోకేశ్వరమండలంలోని శారదావిద్యామందిరంలో చదువుకున్నారు. తెచ్చుకున్న ఉద్యోగమూ ఒకటే. ఇప్పుడు విధులు నిర్వహిస్తున్న ఆఫీసు కూడా ఒకటే కావడం ప్రత్యేకం. వీళ్లంతా 2014లో అగ్రికల్చర్‌ డిప్లొమా పూర్తిచేసి...

Updated : 17 Mar 2022 10:01 IST

మౌనిక.. మౌనిక... మౌనిక! 

కోర్టులో పిలిచినట్లు మూడుసార్లు పిలుస్తున్నారేంటి అనుకుంటున్నారా? అదేం కాదండీ. వాళ్లు ముగ్గురూ స్నేహితురాళ్లు. అందరి పేర్లూ మౌనికనే. కాకపోతే ఒకరు మోరె మౌనిక మరొకరు సిబ్బుల మౌనిక. ఇంకో అమ్మాయి కుంట మౌనిక. ముగ్గురూ నిర్మల్‌ జిల్లా లోకేశ్వరమండలంలోని శారదావిద్యామందిరంలో చదువుకున్నారు. తెచ్చుకున్న ఉద్యోగమూ ఒకటే. ఇప్పుడు విధులు నిర్వహిస్తున్న ఆఫీసు కూడా ఒకటే కావడం ప్రత్యేకం. వీళ్లంతా 2014లో అగ్రికల్చర్‌ డిప్లొమా పూర్తిచేసి... 2017లో ముగ్గురూ మండల వ్యవసాయ విస్తరణాధికారులుగా ఎంపికయ్యారు. అదే మండలంలో కొలువులు రావడంతో ఒకే ఆఫీసులో విధులు నిర్వహిస్తున్నారు. ఒకేపేరు... ఒకే పాఠశాల... ఒకే ఉద్యోగం.. ఒకే కార్యాలయంలో విధులు... వినేవారికి వింతగానూ ఆసక్తిగానూ ఉంది కదా? ‘మొదట్లో చాలామంది గందరగోళానికి గురయ్యేవారు. కానీ మేమంతా కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని’ అంటున్నారీ మౌనికలు!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్