విడివిడిగా చూడండి!

ఉద్యోగిని ఇంటా... బయటా రెండు రకాల బాధ్యతలను మోస్తోంది. అయితే వీటికి సమన్యాయం చేయలేక ఇబ్బంది పడే వారి కోసమే ఈ చిట్కాలు...

Updated : 23 Mar 2022 05:51 IST

ఉద్యోగిని ఇంటా... బయటా రెండు రకాల బాధ్యతలను మోస్తోంది. అయితే వీటికి సమన్యాయం చేయలేక ఇబ్బంది పడే వారి కోసమే ఈ చిట్కాలు...

పనులు పంచండి... ఇంట్లో పనులన్నీ మీరే చేయాలని చూడొద్దు. ఇలా చేస్తే సమయం సరిపోదు. కాబట్టి కుటుంబ సభ్యులకూ కొన్ని అప్పజెప్పండి. ఇంట్లో అత్తామామలుంటే చిన్నారుల భోజనం, హోంవర్క్‌ లాంటివి వారికి అప్పగించండి. దీనివల్ల మీకు కాస్త పని తగ్గుతుంది.  

పిల్లలకూ నేర్పండి.. చిన్నారులకు వారి పనులు వారు చేసుకునేలా అలవాటు చేయండి. పుస్తకాలు సర్దుకోవడం, గదిని శుభ్రం చేసుకోవడం... లాంటివి వారినే చేయమనండి. కొన్ని రోజులు మీరు పర్యవేక్షిస్తే తర్వాత సొంతంగా చేసుకుంటారు.  

ఇల్లూ.. ఆఫీస్‌... దేనికదే.. ఆఫీసులో ఉన్నప్పుడు ఇల్లు, పిల్లలు అంటూ ఆలోచించొద్దు. అదేపనిగా ఇంటికి ఫోన్‌ చేసి మాట్లాడొద్దు. ఇది మీ పనిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. విరామం, భోజన సమయంలో మాట్లాడితే ఏ ఇబ్బందీ ఉండదు. అలాగే ఇంటికి సంబంధించిన పని, ఇంటి దగ్గరే వదిలేయాలి. ఆఫీసుకు తేవద్దు.  

ప్రేమతో... ఆఫీస్‌ నుంచి వచ్చాక సమయమంతా కుటుంబానికే కేటాయించండి. చిన్నారులు, మిగతా కుటుంబ సభ్యులతో గడపండి. ఎక్కువ సమయాన్ని పిల్లలకు కేటాయించండి. పెద్దవారి బాగోగులు చూడటం మరిచిపోవద్దు. సెలవుల్లో కుటుంబ సభ్యులతో బయటకు వెళ్లడం... వీలైనప్పుడు ఒక రోజు పనులన్నీ ఇంట్లో వాళ్లకు అప్పగించి పూర్తిగా విశ్రాంతి తీసుకోవడం వంటివి పునరుత్తేజాన్ని ఇస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్