దుఃఖాలను పోగొట్టే ముద్ర

అనుకున్నది జరగక పోవడం, ఇష్టమైన వ్యక్తులతో విభేదాలు, మనసులో ఏదో తెలీని బాధ.. ఇలా నిత్య జీవితంలో అనేక దుఃఖాలు మనల్ని అలజడికి గురి చేస్తుంటాయి. దాంతో రోజంతా అన్య మనస్కంగా ఉంటాం. కానీ అలాంటి దిగుళ్లూ దుఃఖాలూ యోగాతో

Published : 27 Mar 2022 00:50 IST

పంకజ ముద్ర

నుకున్నది జరగక పోవడం, ఇష్టమైన వ్యక్తులతో విభేదాలు, మనసులో ఏదో తెలీని బాధ.. ఇలా నిత్య జీవితంలో అనేక దుఃఖాలు మనల్ని అలజడికి గురి చేస్తుంటాయి. దాంతో రోజంతా అన్య మనస్కంగా ఉంటాం. కానీ అలాంటి దిగుళ్లూ దుఃఖాలూ యోగాతో నయమవుతాయంటే ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కానీ ఇందులో అతిశయోక్తి ఏమీ లేదు. పంకజ ముద్ర లేదా పద్మ ముద్ర ప్రయత్నించి చూడండి!

పంకజ ముద్రను పూసజ్జ ముద్ర అని కూడా అంటారు. కుదిరితే పద్మాసనంలో లేదా సుఖాసనంలో కూర్చోవాలి. రెండు చేతులనూ వేళ్లనూ విశ్రాంతిగా ఉంచి బొటనవేలు, చిటికెన వేలు కలిపి ఉంచాలి. మిగిలిన వేళ్లన్నీ విడివిడిగా విచ్చుకున్న పద్మంలా పెట్టి ఉదరభాగానికి దగ్గరగా.. ఒక అంగుళం దూరంలో ఉంచాలి. కళ్లు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెట్టాలి. ఈ ముద్ర వల్ల మనసు చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఎంత కష్టమొచ్చినా, ఎంత ఆపద లేదా దుఃఖం ముంచుకొచ్చినా.. అన్నింటి నుంచీ బయట పడటానికి ప్రకృతి ఎప్పుడూ వ్యక్తి, వస్తువు, సన్నివేశం, సంఘటన- ఏదో ఒక రూపంలో సహాయం అందిస్తూనే ఉంటుంది. దాన్ని తెలుసుకుని మనం అందుకోవాలి. ఈ ముద్ర చేయడం వల్ల ఇలాంటివన్నీ కూడా మనకు అర్థమవుతాయి. చాలాసార్లు మనం ప్రకృతి అందించేవాటిని, మన చుట్టూ ఉన్న అంశాలను పట్టించుకోం. కానీ ఈ ముద్ర వల్ల మానసిక వికాసం కలుగుతుంది. భయం పోతుంది. చాలా బాధలూ దుఃఖాలకు భయం ముఖ్య కారణం. కొన్ని విషయాల్లో మనల్ని మనమే బంధించుకుంటాం. వీటన్నిటికీ కారణమైన భయం పోతుంది. ఈ ముద్ర చేస్తున్నప్పుడు మిమ్మల్ని మీరు వికసిస్తున్న పద్మంలా భావించాలి. ఇలా 5 నుంచి 10 నిమిషాలు చేస్తే జీవితం హాయిగా గడిచిపోతుంది. అలాగే మనకు కావలసిన వస్తువులు, సంపదలూ అన్నీ వచ్చి చేరతాయి. అన్నిటినీ మించి మనసు ప్రశాంతంగా, ఆనందంగా ఉంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని