పెళ్లి కాకుండా బిడ్డను దత్తత తీసుకోవచ్చా?

నాకు 28 ఏళ్లు. ప్రయివేటు ఉద్యోగిని.  ఇద్దరక్కలకు పెళ్లిళ్లు అయ్యాయి. నాన్న మూడేళ్ల కిందట చనిపోయారు. ఇప్పుడు నాకు సంబంధాలు చూస్తున్నారు. కానీ నాకు పెళ్లిష్టం లేదు. అక్కవాళ్ల భర్తలు వరకట్న పిశాచులు. ఎప్పుడూ ఏదో ఒకటి తెమ్మని గొడవ. దీంతో నాకు పెళ్లి మీదే నమ్మకం పోయింది.

Published : 28 Mar 2022 01:00 IST

నాకు 28 ఏళ్లు. ప్రయివేటు ఉద్యోగిని.  ఇద్దరక్కలకు పెళ్లిళ్లు అయ్యాయి. నాన్న మూడేళ్ల కిందట చనిపోయారు. ఇప్పుడు నాకు సంబంధాలు చూస్తున్నారు. కానీ నాకు పెళ్లిష్టం లేదు. అక్కవాళ్ల భర్తలు వరకట్న పిశాచులు. ఎప్పుడూ ఏదో ఒకటి తెమ్మని గొడవ. దీంతో నాకు పెళ్లి మీదే నమ్మకం పోయింది. పెళ్లి చేసుకోకుండా ఎవరైనా అనాథ పిల్లల్ని దత్తత తీసుకోవాలనుకుంటున్నా. దయచేసి  అడాప్షన్‌ ప్రొసీజర్‌ వివరించండి.

- రాధ

మీరు అవివాహితగా ఉండాలని నిర్ణయించుకుని దత్తత తీసుకోవాలనుకోవడంలో తప్పు లేదు. హిందూ దత్తత, భరణం చట్టం, సెక్షన్‌-8, 1956 ప్రకారం స్త్రీలు..  అవివాహితలు, మానసిక స్థితి సరిగా ఉన్నవారు, మేజర్లు, పెళ్లయినా భర్త వదిలేసినవాళ్లు లేదా భర్త చనిపోయినవాళ్లు/ భర్త మతం మార్చుకున్నవాళ్లు/ భర్త ఏడేళ్లకు పైగా కనిపించకుండా పోయినవాళ్లు/ భర్తకు మతిస్థిమితం లేద[ని కోర్టు ద్వారా నిరూపితమైనప్పుడు..ఈ సందర్భాల్లో స్త్రీలు దత్తత తీసుకోవడానికి అర్హులు. సెక్షన్‌-10 ప్రకారం పెళ్లికానివారు, మైనర్లు, హిందువునే దత్తత తీసుకోవాలి. సెక్షన్‌-11 (ఖిజు) ప్రకారం అబ్బాయిని దత్తత తీసుకోవాలంటే మీకు పిల్లాడికి 21 ఏళ్లు తేడా ఉండాలి. అమ్మాయి మైనర్‌ అయితే సరిపోతుంది. ఇంతకు ముందే దత్తత తీసుకున్నవారినీ, ఇచ్చినవారినీ దత్తత తీసుకోవద్దు. సెక్షన్‌-9 ప్రకారం దత్తత ఇచ్చేవారికీ అర్హతలను నిర్ణయించారు. తల్లి/తండ్రి రెండోవారి అనుమతి లేకుండా దత్తత ఇవ్వకూడదు. తల్లిదండ్రులు లేని పిల్లలను కోర్టు అనుమతితో సంరక్షకులు దత్తత ఇవ్వొచ్చు. మీరు దత్తత తీసుకున్న తర్వాత పెళ్లి చేసుకుంటే మీ భర్త సెక్షన్‌-14(4) ప్రకారం స్టెప్‌ ఫాదర్‌గా పరిగణింపబడతారు. సాధారణంగా దత్తత స్వీకరణ పత్రం రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి.  సెక్షన్‌-17 ప్రకారం దత్తత ఇవ్వడానికీ,  తీసుకోవడానికీ ఎలాంటి లావాదేవీలు అంటే క్రయవిక్రయాలు జరపకూడదు. అలా  జరిగిందని తెలిస్తే జైలుశిక్ష లేదా జరిమానా విధిస్తారు. బాగా ఆలోచించి, అన్ని  పద్ధతులు పాటించి దత్తత తీసుకోండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని