కార్యాలయంలో రాజకీయాలా!

ఇప్పుడిప్పుడే చదువు ముగించి ఉద్యోగంలో చేరిన వాళ్లకి పనిచేసే చోట వాతావరణం కొత్తగా ఉంటుంది. కాలేజీలో చదువు మాత్రమే ప్రధానం. ఇతరులతో నచ్చితే స్నేహం చేయొచ్చు, లేదంటే దూరంగా ఉండొచ్చు.

Updated : 03 Apr 2022 06:29 IST

ఇప్పుడిప్పుడే చదువు ముగించి ఉద్యోగంలో చేరిన వాళ్లకి పనిచేసే చోట వాతావరణం కొత్తగా ఉంటుంది. కాలేజీలో చదువు మాత్రమే ప్రధానం. ఇతరులతో నచ్చితే స్నేహం చేయొచ్చు, లేదంటే దూరంగా ఉండొచ్చు. కానీ ఉద్యోగంలో అలా కుదరదు, అందరితో కలిసిమెలిసి ఉండాలి. అయినా గ్రూపిజాలూ రాజకీయాలూ తప్పవు. ఈ నేపథ్యంలో నిపుణులు ఇస్తున్న సలహాలు చూడండి...

* మొట్టమొదట అందరూ ఒకలా ఉండరు.. మనలా అసలే ఉండరు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. భిన్నతత్వాల వ్యక్తులు ఒక దగ్గర చేరినప్పుడు విభిన్న పరిస్థితులు తప్పవని అర్థం చేసుకుంటే వాటిని ఎదుర్కోవడం సులువవుతుంది.

* వయసును బట్టి ఏర్పడే గ్రూపులతో పేచీ లేదు. తమ ఆలోచనల్లో కొంత సామీప్యం ఉంటుంది కనుక వాళ్లు స్నేహంగా ఉంటూ తక్కినవాళ్లతో తక్కువగా మాట్లాడుతుండొచ్చు. అందువల్ల ఇతరులకు ఒనగూరే నష్టం ఏమీ ఉండదు.

* రాజకీయం అనేది బియ్యంలో రాయి కాదు, ఏరి పారేయడానికి. అది ప్రతి రంగంలో, ప్రతి కార్యాలయంలో ఉంటుంది. మీ సహోద్యోగుల్లో ఎవరైనా రాజకీయాలు చేస్తున్నట్టు మీకు అర్థమైనా ఆ సంగతి ఎవరితోనూ ప్రస్తావించకండి. నొప్పించక, తానొవ్వక’ సూత్రాన్ని నమ్మి మీ మానాన మీరు ఉండండి. మీరు ఎవరి జోలికీ వెళ్లరని యాజమాన్యానికి అర్థమైతే ప్రత్యక్షంగా, పరోక్షంగా కూడా మీకెలాంటి అన్యాయం జరగదని గుర్తుంచుకోండి. మీ మనస్తత్వానికి దగ్గరగా అనిపించిన వాళ్లతో చనువుగా ఉండండి. కానీ ఇతరులను కూడా దూరం పెట్టేయనవసరం లేదు. ఎదురుపడినప్పుడు పలకరిస్తే సరిపోతుంది.

* మీ కంటే బాగా పనిచేస్తున్నవారితో పోటీ పెట్టుకోండి. నాసిగా చేసేవారిని పట్టించుకోకండి. మీకు ఎవరి మీదా ఈర్ష్యాద్వేషాలు లేకుంటే.. మీ మీద ఎవరైనా కోపతాపాలు ప్రదర్శించినా అది తాత్కాలికమేనని గుర్తుంచుకోండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్