ప్రేమ నాతో.. పెళ్లి వేరొకరితో!

నేనో ప్రయివేటు కంపెనీలో పనిచేస్తున్నా. సహోద్యోగిని ప్రేమించాను. అతను తల్లిదండ్రుల బలవంతంవల్ల వేరే అమ్మాయిని చేసుకున్నాడు. తనతో సన్నిహితంగా గడిపిన క్షణాలే గుర్తొచ్చి చనిపోవాలనిపిస్తోంది.

Published : 04 Apr 2022 00:48 IST

నేనో ప్రయివేటు కంపెనీలో పనిచేస్తున్నా. సహోద్యోగిని ప్రేమించాను. అతను తల్లిదండ్రుల బలవంతంవల్ల వేరే అమ్మాయిని చేసుకున్నాడు. తనతో సన్నిహితంగా గడిపిన క్షణాలే గుర్తొచ్చి చనిపోవాలనిపిస్తోంది.

- ఓ సోదరి, విశాఖపట్నం

మనమేం చేసినా దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో ముందు తెలీదు. కొన్ని పూర్తవుతాయి, మరికొన్ని సగంలో ఆగిపోతాయి, ఇంకొన్ని అసలే జరగవు. అనుకున్నవన్నీ జరిగితేనే జీవితం అనుకోవడం తెలివితక్కువతనం. కృషి, పట్టుదల, పరిస్థితుల సానుకూలతను బట్టి కొన్ని నెరవేరవచ్చు. కొన్ని కాకపోవచ్చు. దొరకనివాటి గురించి బాధపడటం కంటే జీవితాన్ని ఆనందంగా మలచుకోవాలి. పెళ్లవుతుందని మీరనుకున్నారు. అతనికి తెగువ లేక ఆగిపోయింది. అలాంటి ధైర్యంలేని వ్యక్తిని చేసుకున్నా ఇద్దరికీ సుఖం ఉండదని గుర్తించాలి. మీరు దక్కలేదని బహుశా అతనికీ బాధగానే ఉండొచ్చు. కానీ బాధ్యతలు, సమాజ స్థితిగతులను బట్టి ఒక్కోసారి మనిషి సర్దుబాట్లు చేసుకోక తప్పదు. మీకంటూ కొత్త లక్ష్యాలు ఏర్పరచుకుని వాటిని సాధించడానికి ప్రయత్నించండి. మీకూ, సమాజానికీ మేలు కలిగే పనులు చేస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వెంటనే ఇంకో వ్యక్తిని చేసుకోవడం కంటే కొంత సమయం తీసుకోండి. ఈలోపు పాత విషయాలు మర్చిపోయి పరిస్థితులు చక్కబడతాయి. మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తి తారసపడి, అతడితో ఆనందంగా గడపగలననే నమ్మకం కలిగినప్పుడు పెళ్లి చేసుకోండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని